Suryakumar Yadav interview: దెప్పి పొడిచే మాటలు లేవు. మైదానంలో దూసుకుపోయే సందర్భాలూ లేవు. జస్ట్ ప్రత్యర్థిని ప్రత్యర్థి లాగా చూసే దృశ్యాలు లేవు. కేవలం ఆడటం.. గెలిచేలా ఆడటం.. మాత్రమే కనిపించింది. తద్వారా ప్రత్యర్థి పై మానసికయుద్ధమే కాదు.. అంతకు మించిన పోరాటం దర్శనమిచ్చింది. ఇది సూపర్ 4 పోరులో భాగంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ప్రదర్శన. లీగ్ దశలో జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగితే.. సూపర్ 4 లో మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అయితే చివరికి ఇందులో పై చేయి భారత జట్టుదయింది. అంతేకాదు ఆసియా కప్ వేటలో భారత్ అద్భుతమైన ముందడుగు సాధించింది.
సాధారణంగా పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ అంటే భారత జట్టు కెప్టెన్ నుంచి మొదలుపెడితే ప్లేయర్ల వరకు దూకుడుగా ఉంటారు. వీర స్వర్గం వద్దని.. విజయం మాత్రమే కావాలి అన్నట్టుగా ఆడుతుంటారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకు చిరకాల ప్రత్యర్థి కాబట్టి. అయితే ప్రస్తుత ఆసియా కప్ లో భారత జట్టు అంత సన్నివేశం పాకిస్తాన్ జట్టుకు ఇవ్వడం లేదు. అన్నింటికీ మించి కనీసం ప్రత్యర్థిగా కూడా చూడడం లేదు. మైదానంలోకి దిగడం.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం.. ఆ తర్వాత ఓడించడం.. గెలుపు తాలూకు ఆత్మవిశ్వాసంతో బయటికి రావడం.. ఇదిగో ఇలానే సాగిపోతోంది టీమిండియా వ్యవహార శైలి. టీమిండియా ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆసియా కప్ లో వరుసగా రెండు విజయాలు సాధించింది. అంతేకాదు తమను ఓడించాలంటే పాకిస్తాన్ జట్టు 100 జన్మలు ఎత్తాలి అనే సంకేతాలు ఇచ్చింది.
ఆసియా కప్ లో సూర్య కుమార్ పాకిస్తాన్ జట్టును ఏడిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో గెలిచిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లకు అతడు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇక సూపర్ ఫోర్ మ్యాచ్ లో అయితే కనీసం ప్రత్యర్థులుగా కూడా చూడలేదు. బ్యాటింగ్ విషయంలో.. బౌలింగ్ విషయంలో.. ఫీల్డింగ్ విషయంలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవి ప్రత్యర్థి జట్టుకు బలంగా మారకుండా చూసుకున్నాడు. అందువల్లే భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు తమకు చిరకాల ప్రత్యర్థి కాదని.. తమకు పోటీ అసలు కానే కాదని స్పష్టం చేశాడు. ఒకవేళ హోరాహోరీగా మ్యాచ్ జరిగి ఉంటే.. ఇంత తొందరలో రాదు కదా అంటూ సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు. రెండు జట్ల మధ్య గెలుపు అంతరం విపరీతంగా ఉన్నప్పుడు.. బలమైన పోటీ దారు అనే మాటకు అర్థం లేదని.. ఇంకొకసారి పాకిస్తాన్ జట్టును తమకు బలమైన పోటీ దారు అనే మాటను అనకూడదని సూర్య కుమార్ యాదవ్ సూచించాడు. ఇటీవల సూర్య కుమార్ యాదవ్ ను మాజీ ఆటగాడు అసభ్య పదజాలంతో దూషించాడు. దానికి తగ్గట్టుగానే సూర్య కుమార్ యాదవ్ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీంతో పాకిస్తాన్ జట్టుకు మరోసారి కన్నీళ్లు మిగిలాయి.