Shreyas Iyer: ఇంగ్లండ్ తో మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ త్రో చూడాల్సిందే.. టర్నింగ్ పాయింట్ ఇదే

399 పరుగులు లక్ష్యంతో నాలుగోరోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. 53వ ఓవర్‌ అశ్విన్‌ వేశాడు. నాలుగో బంతిని బెన్‌ ఫోక్స్‌ బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్వేర్‌ లెగ్‌వైపు వెళ్లింది.

Written By: Raj Shekar, Updated On : February 5, 2024 4:59 pm
Follow us on

Shreyas Iyer: టీమిండియా బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యార్‌ బ్యాటింగ్‌లో వరుసగా రెండో టెస్టులోనూ విఫలమయ్యాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతున్న అయ్యర్‌.. పెద్దగా స్కోర్‌ చేయకుండానే పెవిలియన్‌కు వెళ్తున్నాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న అయ్యర్‌.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. తాజాగా వైజాగ్‌ వేదికగా జరుగుతున్న భారత్‌ – ఇంగ్లండ్‌ రెండో టెస్టులోనూ ఇప్పటికే సూపర్‌ రన్నింగ్‌ క్యాచ్‌ పట్టిన శ్రేయాస్‌.. తాజగా రెండో ఇన్నింగ్‌లో అద్భుతమైన త్రోతో కీలక ఇంగ్లండ్‌ ఆటగాడి వినెట్‌ పడగొట్టాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో..
399 పరుగులు లక్ష్యంతో నాలుగోరోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. 53వ ఓవర్‌ అశ్విన్‌ వేశాడు. నాలుగో బంతిని బెన్‌ ఫోక్స్‌ బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్వేర్‌ లెగ్‌వైపు వెళ్లింది. నాన్‌ స్ట్రైకర్‌ బెన్‌స్టోక్స్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన అయ్యర్‌ డైరెక్ట్‌ హిట్‌తో రన్‌ ఔట్‌ చేశాడు. దీంతో స్టోక్స్‌ నిరాశగా పెవిలియన్‌ చేరారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో..
ఇక ఇదే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్‌ జాక్‌ క్రాలే(76)ను అద్భుత క్యాచ్‌తో శ్రేయస్‌ ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్రాలే షాట్‌ ఆడగా బంతి గాల్లోలకి లేచింది. బ్యాక్‌ కవర్డ్‌ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అయ్యర్‌ వెనక్కి పరిగెత్తి డైవ్‌ చేసి మరీ బంతిని అందుకున్నాడు. విశాఖ టెస్ట్‌లో శ్రేయస్‌ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 56(27, 29) పరుగులు మాత్రమే చేశాడు.