Shreyas Iyer : పంజాబ్ జట్టు ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్ వెళ్లడానికి సిద్ధంగా ఉంది.. ఏకంగా పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో ఉంది. 11 మ్యాచ్లు ఆడి.. ఏడు విజయాలతో 15 పాయింట్లతో తిరుగులేని స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు నుంచి టీ స్థాయి ప్రదర్శన ఎవరూ ఊహించలేదు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటికీ.. ఇలా ఆడుతుందని అంచనా వేయలేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. జట్టులో సమష్టి తత్వాన్ని నూరిపోస్తూ పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తిరుగులేని స్థాయిలో టీమ్ ను నిలబెట్టాడు.. అంతేకాదు తన కెప్టెన్ గా వచ్చిన తొలి సీజన్లోనే జట్టును టాప్ స్థానంలో ఉండేలా చేశాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పటిమ వల్ల పంజాబ్ జట్టు ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. ఎందుకంటే గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపాడు అయ్యర్. ఆ జట్టు మేనేజ్మెంట్ ఎందుకనో అతడిని నిలుపుకోలేదు. ఇదే సమయంలో పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ దొరికిందే అవకాశం అనుకొని అయ్యర్ ను కొనుగోలు చేసింది.. అయితే ఆ నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదని అయ్యర్ నిరూపించాడు. తన నాయకత్వంలో జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తూ ఏక్ దమ్ ప్లేస్ లో నిలబెట్టాడు.
Also Read : హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ అద్భుతం.. ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర
2015 నుంచి చూసుకుంటే..
పంజాబ్ జట్టు పరిస్థితి 2015 నుంచి ఒకసారి అంచనా వేస్తే.. 2015లో ఆరు పాయింట్లు సాధించింది. 2016లో 8 పాయింట్లు సాధించింది. 2017లో 14 పాయింట్లు సాధించింది. 2018లో 12 పాయింట్లు సాధించింది. 2019లో 12 పాయింట్లు సాధించింది. 2020లో, 2021 లోనూ 12 పాయింట్లు సాధించింది. 2022లో మాత్రం 14 పాయింట్లు సాధించింది. 2023లో మళ్లీ 12 పాయింట్ల వరకు వచ్చింది. 2024లో 10 పాయింట్లు దక్కించుకుంది. కానీ ఈ పదేళ్లలో ఎన్నడు లేని విధంగా పంజాబ్ జట్టు ప్రస్తుత సీజన్లో 15 పాయింట్లు సాధించింది. వర్షం వల్ల కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే.. పంజాబ్ జట్టు ఖాతాలో కచ్చితంగా మరో విజయం నమోదయ్యేది. అప్పుడు పంజాబ్ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండేది. ఆ పాయింట్లతో పంజాబ్ జట్టు కచ్చితంగా అగ్రస్థానాన్ని ఆక్రమించి ఉండేది.. ఇక జట్టులో స్థిరత్వాన్ని, సమష్టి తత్వాన్ని నెలకొల్పి శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సిసలైన నాయకుడిగా అవతరించాడు. జట్టుకు ఇంతటి విజయాలు అందిస్తున్న అతడికి ప్రీతి జింటా హగ్ ఇచ్చినా తక్కువేనని క్రికెట్ విశ్లేషకులు సరదాగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.