Shreyas Iyer Stunning Catch: పైకి విసిరిన వస్తువు కిందికి వస్తుంది.. దానిని భూమ్యాకర్షణ శక్తి అంటారని అప్పట్లో న్యూటన్ అనే మహాశయుడు ప్రపంచానికి చెప్పాడు. కానీ ఇప్పుడు న్యూటన్ బతికి ఉంటే.. శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ చూసి ఉంటే కచ్చితంగా గ్రావిటీ లేదనే చెబుతాడు. ఎందుకంటే గురువారం నాటి ముంబై మ్యాచ్ లో అయ్యర్ గ్రావిటీని కూడా మూర్చబోయేలా చేశాడు.
17.2 ఓవర్లు.. అప్పటికి ముంబై జట్టు స్కోర్ 174/3.. ఈజీగా 200 దాటుతుందని అనుకున్నారు. పైగా ముంబై బ్యాటర్లు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒకవైపు డికాక్ ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా అప్పటికే ఒక సిక్సర్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో అయ్యర్ మైదానంలో అద్భుతం చేశాడు. యాన్సన్ బౌలింగ్ లో పాండ్యా గట్టిగా కొట్టాడు . ఆ బంతి వెళ్తున్న వేగాన్ని చూసి అందరూ కచ్చితంగా సిక్సర్ అని అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న అయ్యర్ అమాంతం గాల్లో ఎగిరాడు.. బంతిని అందుకున్నాడు. అంతేకాదు అంతే వేగంతో ఆ బంతిని మైదానం లోపలికి విసిరాడు. అతడిని అనుసరించి వచ్చిన బార్ట్ లెట్ ఆ బంతిని అందుకున్నాడు. దీంతో మైదానం ఉన్న ప్రేక్షకుల నుంచి మొదలు పెడితే హార్దిక్ పాండ్యా వరకు అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ క్యాచ్ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా రెండు వందలకు పైగా స్కోర్ చేస్తుందనుకుంటున్న ముంబై జట్టు.. ఒక్కసారిగా గాడి తప్పింది. రూథర్ఫర్డ్(1), తిలక్ వర్మ (8) అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ముంబై జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.
ఈ క్యాచ్ పట్టడం ద్వారా అయ్యర్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయాడు. సమకాలీన క్రికెట్లో అద్భుతమైన ఫీల్డర్ గా పేరుపొందాడు న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్. గ్రావిటీ తో సంబంధం లేకుండా అతడు బంతులను అందుకుంటాడు. కానీ ఈసారి ఫిలిప్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా.. తన కూడా అలా చూస్తూ ఉండిపోయేలా అయ్యర్ ఫీల్డింగ్ చేశాడు. గ్రావిటీకి సరికొత్త అర్థం చెప్పాడు. అయ్యర్ క్యాచ్ పట్టిన తర్వాత మైదానంలో ఉన్న వ్యాఖ్యాతలు దాని గురించి పదేపదే ప్రస్తావించారు. “పంజాబ్ జట్టుకు దొరికిన ఆణిముత్యం శ్రేయస్ అయ్యర్” అంటూ కొని యాడారు.
SHREYAS IYER….. YOU ABSOLUTELY FREAK.
– The reaction of Rohit and Surya and an ice cold Celebration by Sarpanch Saab. pic.twitter.com/dMOYLL7Phl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2026