Shreyas Iyer: ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రేయస్ అయ్యర్ తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకోవడానికి మరో అవకాశం లభించింది. త్వరలో టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ (England cricket board) జట్టుతో వన్డే, టి20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో కేఎల్ రాహుల్ (KL Rahul) ఆడబోడని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలవల్ల తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని బోర్డు పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్ (IPL) లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) ను విజేతగా నిలిపిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్ ఆట తీరు పూర్తిగా మారింది. అయితే శ్రీలంక సీరీస్ లో అతడు అంతగా రాణించలేదు. దీంతో మళ్ళీ దేశవాళి క్రికెట్ బాట పట్టాడు.
X ఫ్యాక్టర్ అవుతాడా?
ఇటీవలి దేశవాళీ క్రికెట్లో అయ్యర్ సత్తా చూపించాడు. అదే ఫామ్ కనుక అతడు కొనసాగిస్తే x factor అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్ లో అయ్యర్ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణించాడు. దేశవాళి క్రికెట్ లోనూ మెరుపులు మెరిపించాడు. నాలుగు రంజి మ్యాచులలో 90.90 సగటుతో 452 పరుగులు చేశాడు.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(SMAT) లో ఐదు మ్యాచ్లలో 325 పరుగులు చేశాడు. ప్రస్తుతం జట్టులో కేఎల్ రాహుల్ లేకపోవడం వల్ల అయ్యర్ కు సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ లో కనుక అయ్యర్ తన పాత ఆట తీరును కొనసాగిస్తే ఖచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవుతాడని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత చాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టీమిండియా ఆడే మ్యాచ్ లు మొత్తం హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. అందువల్ల జట్టులో బలమైన ఆటగాళ్లు ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ గనుక అయ్యర్ రాణిస్తే తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటాడని.. క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయ్యర్ కు బలంగా బ్యాటింగ్ చేసే అనుభవం ఉంది. బంతిని గట్టిగా కొట్టగలిగే నేర్పు కూడా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో అతడు అదే తీరు గనుక కొనసాగిస్తే తిరుగు ఉండదని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.