spot_img
Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer fined reason: శ్రేయస్ అయ్యర్ కు జరిమానా.. వచ్చే మ్యాచ్ కు దూరం.....

Shreyas Iyer fined reason: శ్రేయస్ అయ్యర్ కు జరిమానా.. వచ్చే మ్యాచ్ కు దూరం.. కారణమిదే..

Shreyas Iyer fined reason: ఐపీఎల్ లో పంజాబ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. పంజాబ్ జట్టుకు నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో గత సీజన్లో పంజాబ్ జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది.

ఆ ఓటమి కొద్ది రోజులపాటు ఇబ్బంది పెట్టినప్పటికీ.. పంజాబ్ జట్టు సరికొత్తగా ఇప్పుడు కనిపిస్తోంది. వర్ధమాన ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసిన పంజాబ్ జట్టు మేనేజ్మెంట్.. వారికి అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. ట్రైనింగ్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యవహరించింది. అందువల్లే ఆ జట్టు ప్లేయర్లు అద్భుతంగా ఆడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత సీజన్లో ఎలాంటి దూకుడు ఆట తీరును ప్రదర్శించారో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆడుతున్నారు. దీంతో ఈసారి కూడా పంజాబ్ జట్టు ఫైనల్ వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు.

Also Read: కనిపించని హార్దిక్..ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య.. ఏమైనా ప్లాన్ చేశారా భయ్యా

పంజాబ్ జట్టు వరుస విజయాలతో ఉత్సాహంతో ఉన్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వాహక కమిటీ దిమ్మ తిరిగే వార్త చెప్పింది. పంజాబ్ జట్టుకు నాయకుడిగా ఉన్న అయ్యర్ పై వేటువేసింది. ఒక మ్యాచ్ కు అతడు నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయాడు. కనీసం అతడికి ఆడే అవకాశం కూడా లేదు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వహణ కమిటీ అయ్యర్ కు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజు నుంచి 24 లక్షలను అపరాధ రుసుముగా విధించింది. ఒకవేళ ఈ స్లో ఓవర్ రేటు కనక కొనసాగితే తదుపరి మ్యాచ్లో అయ్యర్ కు ఆడే అవకాశం ఉండదు. అంతేకాదు ఈసారి 30 లక్షలను అపరాధ రుసుముగా విధిస్తుంది.

అయ్యర్ పై వేటు వేసిన నేపథ్యంలో ఏప్రిల్ 6న కోల్ కతా జట్టుతో జరిగే మ్యాచ్ కు అతడు దూరమవుతాడు. అతడి స్థానంలో ఎవరు పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తారన్నది చూడాల్సి ఉంది. చెన్నై తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటు కొనసాగించింది. అందువల్లే ఐపీఎల్ నిర్వాహక కమిటీ అయ్యర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఒక మ్యాచ్ మొత్తానికి దూరంగా పెట్టింది. ఐపీఎల్ నిర్వాహక కమిటీ స్లో ఓవర్ రేటు విషయంలో అత్యంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ అనేది కోట్ల వ్యాపారం. యాడ్స్ స్లాట్ లో ఆలస్యం ఏర్పడితే ఐపీఎల్ నిర్వాహ కమిటీకి విపరీతంగా నష్టం వస్తుంది. అందువల్లే స్లో ఓవర్ రేటు ను ఎప్పటికీ ఐపీఎల్ నిర్వాహక కమిటీ క్షమించదు. గతంలో కూడా ఈ తరహా జరిమానాను రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు ఎదుర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version