spot_img
Homeజాతీయ వార్తలుOperation Sindoor 2.0: త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0.. పాక్ పై యుద్ధానికి భారత్ రెడీ.....

Operation Sindoor 2.0: త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0.. పాక్ పై యుద్ధానికి భారత్ రెడీ.. సంకేతాలు అవే!

Operation Sindoor 2.0: ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం.. ఇంకోవైపు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం.. ఇంకోవైపు ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధం.. మరోవైపు సౌదీ అరేబియా, చైనా బకాయిల ఒత్తిడి.. చివరకు అంతర్గతంగా ఖైబర్‌ ఫఖ్తూఖ్వ్వా, బలూచిస్తాన్‌లో తిరిగుబాట్లతో మన దాయాది దేశం పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సౌదీ అరేబియా 6.3 బిలియన్ డాలర్ల రుణం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడం, చైనా 220 మిలియన్ డాలర్ల బకాయిలు డిమాండ్ చేయడంతో ఒత్తిడి పెరిగింది. విదేశీ మారకాల రిజర్వులు 9 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38 శాతానికి చేరింది. మొత్తంగా పాకిస్తాన్‌ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. దీనిని తమక అవకాశంగా మలుచుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారత్‌ కంట్లో నలుసులా మారిన పాకిస్తాన్‌ను మరోసారి దెబ్బకొట్టేందుకు ఇదే అనువైన సమయమని భావిస్తోంది.

త్రివిధ దళాధిపతులతో కీలక చర్చలు..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో వరుస భేటీలు నిర్వహించడం, పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, మరోసారి సైనిక చర్యకు సిద్ధమవుతోందా అనే చర్చ సాగుతోంది. పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం, దౌత్య సంబంధాలు తెంచుకోవడం వంటి చర్యలు ఇందుకు నిదర్శనం.

రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్..
భారత్ అనేక రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ అభ్యాసాలు జరుగుతున్నాయి. ప్రజలకు 3 నెలల రేషన్ సరఫరా చేయడం, యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇది యుద్ధ సిద్ధతలో భాగమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఆపరేషన్ సింధూర్ 2.0తో పాక్‌ వినాశనమే?
2025 మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్‌పై క్షిపణి దాడులు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా 26 మంది పౌరుల హత్యకు బాధ్యులైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0తో మరింత విస్తృత దాడులు చేయడానికి సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాక్ మేకపోతు గాంభీర్యం
పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీఫ్‌ మునీర్, “భారత్ ప్రతీకార చర్యలకు దిగితే దీటుగా బదులిస్తామని” మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ వాస్తవ పరిస్థితి వేరు. ఆర్థిక సంక్షోభం, అంతర్గత కలహాలు (బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా), దౌత్య ఏకాంతం (విదేశీ ఎంబసీలు మూతపడటం)తో పాక్ సైనిక చర్యకు సిద్ధంగా లేదు.

భారత్ పాకిస్తాన్‌పై మరోసారి దాడి చేసే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారదు. ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఎక్కువ. పాక్ ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒత్తిళ్లను అవకాశంగా మలుచుకుని, భారత్ తన సైనిక సామర్థ్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version