Shreyas Iyer: ప్రస్తుత సీజన్లో పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) నాయకత్వం వహిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో పంజాబ్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు టాప్ స్థానం కోల్పోయింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోవడంతో.. వరుసగా మూడు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానాన్ని చేరుకుంది. ఒక ఓటమి, మూడు విజయాలతో గుజరాత్ టైటాన్స్ రెండవ స్థానంలో ఉంది. రెండు ఓటములు, ఒక విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్ జట్టు ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పదిపరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అది జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
Also Read: ఓహో అశ్విన్ యూ ట్యూబ్ చానెల్ లో CSK మ్యాచ్ ల రివ్యూ.. అందుకే చెప్పడం లేదా..
రికీ పాంటింగ్ ఏమన్నాడంటే..
పంజాబ్ జట్టు కోచ్ గా పాంటింగ్ కొనసాగుతున్నాడు. అయితే పంజాబ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో ఓడిపోయిన అనంతరం.. పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన మనోగతాన్ని ఓ ఆంగ్ల పేపర్ క్రీడా ప్రతినిధితో పంచుకున్నాడు. ” నేను కోచ్ ను మాత్రమే. విజయాలకు, ఓటములకు బాధ్యత వహిస్తాను. కానీ మ్యాచ్ మొదలైన తర్వాత జట్టును కెప్టెన్ కు అప్పగిస్తాను. ఆట మొదలైన తర్వాత కోచ్ పాత్ర తక్కువగా ఉంటుంది. అతడు తక్కువగానే చేస్తాడు.. శ్రేయస్ ను కొనుగోలు చేయడం ద్వారా మా ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పాం. నాకు, మా జట్టు యాజమాన్యానికి అయ్యర్ మీద నమ్మకం ఉంది. అతడు భారత జట్టుకు ఉత్తమ కెప్టెన్ కావాలని కోరుకుంటున్నాం. మేము మాకు కావలసిన వ్యక్తిని సొంతం చేసుకున్నాం. అతను మా జట్టు విజయాలకు.. మా జట్టులో ఐక్యతకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అతనితో గడపడాన్ని ఆస్వాదిస్తున్నాను. అతడు నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. నేర్చుకోవడంలో అతడికి అతడే సాటి. గొప్ప ప్లేయర్ అయినప్పటికీ.. అతడిలో ఏమాత్రం అహం ఉండదు. పైగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటాడు. అతడి లాంటి ఆటగాడు జట్టులో ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. అతడు జట్టను ఏకం చేయడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాడని” పాంటింగ్ వ్యాఖ్యానించాడు. పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగించగా.. శ్రేయస్ అయ్యర్ వ్యక్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తులో ఉంచుతున్నాయి. రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను పంజాబ్ అభిమానులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అతడి ఆధ్వర్యంలో పంజాబ్ జట్టు ఛాంపియన్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.