Shreyas Iyer Captain Performance IPL 2026: ఈ మనిషిలోనైనా ఒకటే క్వాలిటీ ఉంటుంది. కానీ ఇతడిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి.. దేనికీ వంక పెట్టాల్సిన అవసరం లేదు. సమకాలీన క్రికెట్లో బ్యాటింగ్ చేయగలడు. ఫీల్డింగ్ అద్భుతంగా చేయగలడు. నాయకుడిగా సంచలన నిర్ణయాలు తీసుకోగలడు. అందువల్లే ప్రస్తుత ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టును నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇతడి ఆధ్వర్యంలో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
హార్థిక్ పాండ్యా క్యాచ్
ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ అన్ని రంగాలలో తన బృందాన్ని ముందు వరుసలో నిలిపాడు. ముంబై జట్టు డికాక్(112) సెంచరీ ఎందుకూ పనికి రాకుండా పోయింది. 200+ పైగా స్కోర్ చేస్తుందనుకుంటున్న తరుణంలో.. ముంబై జట్టుకు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చాడు అయ్యర్. 14 పరుగులు చేసి దూకుడు మీద ఉన్న హార్థిక్ పాండ్యాను..ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. యాన్సన్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టిన హార్దిక్ పాండ్యా.. అది కచ్చితంగా సిక్సర్ వెళ్తుంది అనుకున్నాడు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న అయ్యర్ ఆ బంతిని అమాంతం అందుకున్నాడు. బ్యాలెన్స్ ఆపుకుని.. బంతిని మైదానం లోపలికి విసిరేశాడు. దీంతో అక్కడే ఉన్న బార్ట్ లెట్ ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నిరాశతో మైదానం వీడి వెళ్లిపోయాడు.
మార్చి మార్చి బౌలింగ్
బౌలర్ల విషయంలో కూడా అయ్యర్ సరికొత్త విధానాన్ని పాటించాడు. మూడో వికెట్ కు నమన్ ధీర్(50), డికాక్ (112) మూడో వికెట్ కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత.. పంజాబ్ బౌలర్లలో నిరాశ మరింత ఆవహించింది. ఈ దశలో అయ్యర్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు.. అర్ష్ దీప్ సింగ్, యాన్సన్, బార్ట్ లెట్, శశాంక్ సింగ్ తో పదేపదే బౌలింగ్ చేయించాడు.. ఫలితంగా చూస్తుండగానే ముంబై వికెట్లు కోల్పోయింది. ఇది ముంబై భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది.
హాఫ్ సెంచరీ తో..
196 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందు ఉంచిన నేపథ్యంలో.. ప్రారంభం నుంచి పంజాబ్ ధాటిగానే బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ లోనే 20 పరుగులు సాధించింది. ఓపెనర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్( 80*) సత్తా చూపించాడు.. మర ఓపెనర్ ప్రియాంష్ ఆర్య(15), కూపర్ కన్నోలీ(17) విఫలమయ్యారు. ఈ దశలో వచ్చిన అయ్యర్ (66) హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. ముఖ్యంగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి అయ్యర్ కూడా వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇది పంజాబ్ జట్టుకు అడ్వాంటేజ్ గా మారింది. ఈ దశలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. అంతటి బుమ్రాన్ ఏమీ చేయలేకపోయాడు. ఇలా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో తనలో ఉన్న మూడు పాత్రలకు న్యాయం చేయడం ద్వారా పంజాబ్ జట్టును గెలిపించాడు అయ్యర్.