Shreyanka Patil: శ్రేయాంక పాటిల్.. ఈ 21 సంవత్సరాల యువతి WPL(women’s premier league) -24 లో. సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఢిల్లీ జట్టుపై ఏకంగా నాలుగు వికెట్లు తీసింది. 113 పరుగులకే కుప్పకూలేలా చేసింది. బెంగళూరు జట్టు విజేతగా ఆవిర్భవించేలా కృషి చేసింది.. అంతేకాదు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఏకంగా 13 వికెట్లు సాధించింది.. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ అందుకొని ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకుంది. అలాంటి ఈ క్రీడాకారిణి పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతోంది. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా.. అద్భుతమైన బ్యాటింగ్ చేయగలిగే సత్తా శ్రేయాంక పాటిల్ సొంతం. తనదైన రోజు మైదానంలో శివంగిలాగా ఆడుతుంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతుంది.
మనదేశంలోనే కాదు కరేబియన్ లీగ్ లో ఆడిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక పాటిల్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ మైదానాలపై వీరవిహారం చేసింది. బెంగళూరు జట్టు 16 సంవత్సరాల ఐపీఎల్ ట్రోఫీ కరువును తీర్చింది. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మహిళా టి20 ప్రపంచ కప్ నకు సన్నద్ధమవుతోంది. అయితే
శ్రేయాంక పాటిల్ ట్విట్టర్లో చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..”నా క్రికెట్ ఆరాధ్య దైవం విరాట్ కోహ్లని కలుసుకున్నాను. విరాట్ కోహ్లీ నన్ను పేరు పెట్టి పిలిచాడు. నేను క్రికెట్ చూసేందుకు ఏకైక కారణం అతడు. అతడిలాగా ఎదగాలని కలలు కన్నాను. కష్టపడి ఇక్కడి దాకా వచ్చాను. నిన్న రాత్రి అతనితో ఉన్న క్షణాలను మర్చిపోలేను. హేయ్ శ్రేయాంక పాటిల్.. బాగా బౌలింగ్ చేశావు అని నాతో అన్నాడు. అతడు నా పేరు గుర్తుపెట్టుకున్నాడంటూ”
శ్రేయాంక పాటిల్ మురిసిపోయింది..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం తలపడునుంది. ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి ప్రారంభ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి మొత్తం బెంగళూరు, చెన్నై మీద పడింది. ఈ పోటీని దృష్టిలో ఉంచుకొని బెంగళూరు జట్టు యాజమాన్యం అన్ బాక్స్ పేరుతో వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు బెంగళూరు జట్టు మహిళా క్రీడాకారులు హాజరయ్యారు. వారందరితో కోహ్లీ ముచ్చటించాడు. కప్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతకుముందు కప్ గెలిచినప్పుడు క్రీడాకారిణులతో కోహ్లీ వీడియో కాల్ లో మాట్లాడాడు.
Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said,
“Hi Shreyanka, well bowled.”
He actually knows my name #StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0— Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024