Jasprit Bumrah: అయితే ఈసారి గత తప్పును పునరావృతం చేయకుండా.. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని టీమ్ ఇండియా ఆశపడుతోంది. ఇందులో భాగంగానే ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అయితే టీమిండియా ఆశల పైన నీళ్లు చల్లే ఒక వార్త జాతీయ మీడియాలో ప్రస్తుతం ప్రసారమవుతోంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు వజ్రాయుధం లాగా కీలక బౌలర్ బుమ్రా ఉన్నాడు. ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం అతడు వెన్ను నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో అతడు విరామం లేకుండా బౌలింగ్ చేశాడు. చివరికి సిడ్నీ టెస్ట్ కు నాయకత్వం వహించాడు. అయితే ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ సమయంలోనే వెన్నునొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో మైదానం మధ్యలో నుంచే బుమ్రా వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించాడు.. ఈ క్రమంలో బుమ్రా కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో.. అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. తర్వాత అతడు మెరుగైన చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్ళాడు.
వంద శాతం సాధించడం కష్టమే..
బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ సమయం నాటికి కోలుకుంటాడని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. అందుకే అతడిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. అయితే అతడు ఆ సమయ నాటికి కోలుకునేది కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా న్యూజిలాండ్ లో చికిత్స పొందుతున్నాడు. న్యూజిలాండ్ లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ రోవాన్ షౌటెన్ అతడికి చికిత్స అందిస్తున్నాడు. వెన్ను నొప్పి తీవ్రత దృష్ట్యా బుమ్రా నూటికి నూరు శాతం ఫిట్ నెస్ సాధించడం కష్టమేనని షౌటెన్ అభిప్రాయ పడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం టీమిండియా సెలెక్టర్లకు కూడా తెలుసని ఆ ఆ కథనాల సారాంశం. ఒకవేళ ఇదే గనుక జరిగితే టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ లో భారీ షాక్ అని చెప్పక తప్పదు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టి20, వన్డే సిరీస్ కు మహమ్మద్ షమీ ని సెలక్టర్లు ఎంపిక చేశారు.. అయితే అతడు కోల్ కతా టి20 మ్యాచ్ లో ఆడకుండానే నిష్క్రమించాడు. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు తుది సామర్థ్యాన్ని సాధించడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. గాయం వల్ల సుదీర్ఘకాలం క్రికెట్ కు దూరమై.. లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకొని.. ఇటీవల దేశవాళి క్రికెట్ ఆడిన షమీ.. ఇప్పుడు మళ్లీ గాయం బారిన పడటం విశేషం. అటు బుమ్రా.. ఇటు షమీ గాయాల బారిన పడటం.. టీం ఇండియాకు షాకింగ్ న్యూస్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.