Homeఎంటర్టైన్మెంట్SSMB 29: ఎస్ఎస్ఎంబి 29.. అదో పెద్ద మిస్టరీ! అసలు రాజమౌళి ఎందుకు ఇలా చేస్తున్నాడు?

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29.. అదో పెద్ద మిస్టరీ! అసలు రాజమౌళి ఎందుకు ఇలా చేస్తున్నాడు?

SSMB 29: రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన తన సినిమా విషయంలో కాంప్రమైజ్ కాడు. పట్టుబట్టి అనుకున్న అవుట్ ఫుట్ సాధిస్తాడు. అలాగే కర్త కర్మ క్రియ తానై వ్యవహరిస్తారు. రాజమౌళి ఎంత పెద్ద ఫిల్మ్ మేకరో… అంతకు మించిన మార్కెటింగ్ నిపుణుడు. తన సినిమాలను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలి? మార్కెట్, హైప్ ఎలా క్రియేట్ చేయాలో? తెలిసిన జీనియస్. బాహుబలి 2 వసూళ్ల వెనుక రాజమౌళి వ్యూహాలు చాలానే ఉన్నాయి.

కాగా రాజమౌళి కొత్త సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్ ముందుకు వస్తారు. సినిమా గురించి ప్రాథమిక సమాచారం ఇస్తాడు. ఎస్ఎస్ఎంబి 29 విషయంలో కూడా ఒకింత ఆయన ఈ పద్ధతి ఫాలో అయ్యాడు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని చెప్పారు. అంత వరకు ఓకే.. కానీ ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ షెడ్యూల్స్ గురించి రాజమౌళి చెప్పడం లేదు.

చివరకు పూజా సెరిమోని కూడా అత్యంత రహస్యంగా నిర్వహించారు. హైదరాబాద్ శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో మీడియాకు కూడా అనుమతి లేకుండా పూర్తి చేశారు. అక్కడే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగినట్లు పరిశ్రమలో టాక్ ఉంది. తాజాగా రాజమౌళి ఆసక్తికర సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. సింహం ఫోటో ఎదుట ఒక పాస్ పోర్ట్ ని పట్టుకుని ఫోజిచ్చాడు. ఇది చర్చకు దారి తీసింది.

కెన్యా దేశంలోని అంబోసెలి నేషనల్ పార్క్ ని గతంలో సందర్శించిన రాజమౌళి అక్కడ షూటింగ్ ప్లాన్ చేశాడని, టీమ్ ప్రయాణం అవుతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కాగా అసలు రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ సమాచారం మీడియాకు ఎందుకు ఇవ్వడం లేదు. చిత్రీకరణ మొదలైన సమాచారం దాచాల్సిన అవసరం ఏమిటనే వాదన ఉంది. షూటింగ్ సెట్స్ నుండి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడతాడని తెలుసు. కానీ ఎస్ఎస్ఎంబి 29 పై స్పందించేందుకు అధికారికంగా రాజమౌళి మీడియా ముందుకు కూడా రాలేదు. దీని వెనుక రాజమౌళి స్ట్రాటజీ ఏమిటనే చర్చ మొదలైంది. కాగా రాజమోళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్టు ఇది. బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు అని సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular