Rohit Sharma: ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ గా తనదైన బాధ్యతను నిర్వర్తించిన రోహిత్ శర్మ ఐపిఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక ముంబై ఇండియన్స్ టీమ్ ప్రస్తుతం అతన్ని తీసివేసి హార్దిక్ పాండ్యని కెప్టెన్ గా నియమించింది. నిజానికి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యని ట్రేడింగ్ విధానం ద్వారా కొనుగోలు చేసినప్పటికీ ఫ్యూచర్ లో అతన్ని కెప్టెన్ గా చేసే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.
అయితే రోహిత్ శర్మ రిటైర్ అయ్యేంత వరకు రోహిత్ శర్మనే కొనసాగుతాడని కూడా అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తు ముంబై యాజమాన్యం మాత్రం హార్థిక్ పాండ్య ని కెప్టెన్ గా నియమించింది. ఆయన 2024 సీజన్ నుంచే కెప్టెన్ గా భాద్యతలను స్వీకరించబోతున్నట్టుగా కూడా తెలియజేసింది.అయితే ముంబై ఇండియన్స్ టీమ్ ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నామంటూ ముంబై ఇండియన్స్ టీం గ్లోబల్ హెడ్ గా ఉన్న మహేళ జయవర్ధనే తెలియజేశారు. రోహిత్ శర్మ 2013 వ సంవత్సరంలో కెప్టెన్ అయినప్పటికీ ఆ సంవత్సరం ముంబై ఇండియన్స్ ని విజేతగా నిలిపారు.
ఇక అప్పటినుంచి అతన్నే కెప్టెన్ గా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.ఇక ఇప్పటికి 10 సంవత్సరాలు అతనే కెప్టెన్ గా వ్యవహరించాడు. అయినప్పటికీ 2021, 2022 వ సంవత్సరంలో అంత మంచి పర్ఫామెన్స్ ని అందించలేదు 2023 వ సంవత్సరంలో సెమీఫైనల్ కి వెళ్ళినప్పటికీ అందులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అందుకే ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని ముంబై ఇండియన్స్ యాజమాన్యం టీమ్ కి ఒక బలమైన కెప్టెన్ కావాలని అనుకొని హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశ్యం తోనే గుజరాత్ టైటాన్స్ నుంచి తనని ట్రేడింగ్ విధానం ద్వారా తీసుకుని అతన్ని కెప్టెన్ గా చేస్తున్నట్టుగా ప్రకటించింది…2022వ సంవత్సరంలో గుజరాత్ టైటాన్స్ టీమ్ హార్దిక్ పాండ్యని తీసుకొని అతన్ని కెప్టెన్ గా చేసింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ టీం పాండ్య ని తీసుకుంది. అయితే ఈ రెండు సంవత్సరాల్లో పాండ్య గుజరాత్ టీమ్ కి ఒక సారి టైటిల్ అందించాడు. అలాగే ఇంకా 2023 వ సంవత్సరంలో కూడా టీమ్ ని ఫైనల్ కి చేర్చాడు.అలా టీమ్ ని ముందు ఉండి నడిపించడంలో హార్థిక్ పాండ్య కనపరిచిన తీరు ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి బాగా నచ్చడంతో ఈసారి కెప్టెన్ గా ఆయనకి అవకాశం కల్పించింది…అయితే రోహిత్ శర్మ కూడా ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ టీం కి 5 సార్లు ఐపిఎల్ ట్రోఫీని అందించడం విశేషం…