
Rohit Sharma- Dhoni: ధోని అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ వార్తే. చెన్నై జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనిని పక్కన పెట్టి.. హిట్ మ్యాన్ వైపు మొగ్గుచూపింది. స్టార్ స్పోర్ట్స్ సంస్థ, ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్ క్రీడబుల్ అవార్డులు ప్రకటించింది.. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో… ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013_22 మధ్యలో ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపినందున అతడికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు కు ఎంపిక చేసినట్టు స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పీ ఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకటించాయి.
79 సార్లు విజేతగా..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ 143 మ్యాచ్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్తో 79 సార్లు ముంబై ఇండియన్స్ ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్ మ్యాన్ నే పురస్కారం వరించింది. ఉత్తమ డాటర్ కేటగిరి విషయానికొస్తే ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా నామినేట్ అయ్యారు.. డివిలియర్స్ ను వరించింది.. మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా పేరుపొందిన ఇతడు 2008_21 మధ్య కాలంలో 184 మ్యాచుల్లో మూడు సెంచరీలు, 40 ఆఫ్ సెంచరీల సహాయంతో 39.71 సగటున 5,162 పరుగులు చేశాడు.. 2016 సీజన్లో ఆర్ సి బి తరఫున 168.97 స్ట్రైక్ రేటుతో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

ఈ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరీలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్,బట్లర్ పోటీ పడగా… కోహ్లీ విజేతగా నిలిచాడు..కోహ్లీ 2016 సీజన్ లో ఆర్సిబి తరఫున 152.03 స్ట్రైక్ రేట్ తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రతిభావంతమైన క్రికెటర్ కేటగిరీలో సునీల్ నరైన్, అండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా…ఈ అవార్డు ఆండ్రీ రసెల్ ను వరించింది.
బౌలర్ కేటగిరీలో రషీద్ ఖాన్, బుమ్రా, నరైన్, చాహల్, నామినేట్ కాగా బుమ్రా విజేతగా నిలిచాడు.. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికి వస్తే ఈ విభాగంలో సునీల్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్(2020), చాహల్(2022) నామినేట్ కాగా.. చాహల్ ను ఈ అవార్డు వరించింది.