
Tarakaratna- Mohan Babu: ఇండస్ట్రీ లో అందరితో కలివిడిగా ఉంటూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న నందమూరి తారకరత్న మరణం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.నారాలోకేష్ ‘యువ గళం’ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి క్రింద పడిపోవడంతో ఆయనని వెంటనే హాస్పిటల్ కి చేర్చి గత 23 రోజుల నుండి చికిత్స చేయిస్తూ వచ్చారు, విదేశాల నుండి కోట్లు ఖర్చు పెట్టి చికిత్స చేసిన కూడా ఆయన ప్రాణాలను కాపాడలేకపొయ్యారు డాక్టర్లు.
ఆయన మరణం పట్ల అటు సినీ ప్రముఖులు ఇటు రాజకీయ నాయకులూ తీవ్రమైన దిగ్బ్రాంతి ని వ్యక్తపరుస్తూ తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.కానీ మంచు మోహన్ బాబు మరియు విష్ణు తారకరత్న పార్థివ దేహాన్ని చూసేందుకు రాకపోవడం పై సోషల్ మీడియా లో పెద్ద చర్చ కి దారి తీసింది.నందమూరి కుటుంబం తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న మోహన్ బాబు ఇలా ఎందుకు చేశాడంటూ ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు నెటిజెన్స్.
గతం లో మోహన్ బాబు కి తారకరత్న కి మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగిందని, అప్పటి నుండి తారకరత్న కి మోహన్ బాబు కి మధ్య మాటలు లేవని, అందుకే చనిపోయినప్పుడు కూడా మోహన్ బాబు మరియు అతని కుటుంబ సభ్యులు చివరి చూపు చూసేందుకు రాలేదని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యాయి.

ఇంతలోపే మోహన్ బాబు ఒక ట్వీట్ వేస్తూ ‘లండన్ లో ఉన్న నేను తారకరత్న చనిపొయ్యాడనే వార్తని తెలుసుకొని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యాను.నేను అతనిని చివరి చూపు కూడా చూసుకోలేకపోతున్నందుకు ఎంతో బాధగా ఉంది, నా బిడ్డ విష్ణు కూడా హైదరాబాద్ లో లేదు సింగపూర్ లో ఉన్నాడు.తారకరత్న నా కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు, ఎంతో మంచివాడు.ఇక అతను ఎంత గొప్ప స్నేహశీలి అని చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా సరిపోవడం లేదు’ అంటూ తారకరత్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు మోహన్ బాబు.