Shikhar Dhawan Viral Photo : శిఖర్ ధావన్ 2012లో ఆయేషాముఖర్జీ అని భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళను వివాహం చేసుకున్నాడు. అంతకుముందే ఆమెకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా. అయితే ఆమె తన మొదటి భర్తతో విడిపోయింది. ప్రొఫెషనల్గా ఆమె బాక్సర్ కూడా. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శిఖర్ ధావన్ కు ఆయేషాముఖర్జీ పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరు వివాహం చేసుకున్నారు.. వారికి ఒక కుమారుడు సంతానం. 2023 వరకు వారిద్దరి వైవాహిక జీవితం బాగానే ఉంది. అయితే అనుకోకుండా చోటు చేసుకున్న పరిణామాలు వారిద్దరి మధ్య విభేదాలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఇద్దరు విడిగా ఉండడం మొదలుపెట్టారు. అనంతరం విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తన కుమారుడిని చూసేందుకు ఆయేషా ముఖర్జీ ఒప్పుకోవడం లేదని ఇటీవల ధావన్ ఆరోపించాడు. అంతేకాదు తన కుమారుడితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సరిగా అతడు ఆ మాటలు మాట్లాడిన కొద్ది రోజులకే సోఫీ షైన్ అనే ఐర్లాండ్ యువతితో కనిపించాడు. మొదట్లో వారిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి.
Also Read : రేపటి ఫైనల్ లో బెంగళూరా? పంజాబా? ఏ జట్టు విజయం సాధిస్తుందంటే?
ఇటీవల సోఫీతో వ్యవహారాన్ని ఓపెన్ గా చెప్పేశాడు ధావన్. సోఫీ ఐర్లాండ్ దేశానికి చెందిన యువతి. ఈమె ఒక బహుళ జాతి సంస్థలో ప్రోడక్ట్ కన్సల్టెంట్ గా అబుదాబిలో పనిచేస్తోంది.. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ధావన్ తన స్నేహితురాలితో కలిసి అక్కడికి వెళ్ళాడు. దుబాయ్ లో భారత్ ఆడిన మ్యాచులు వీక్షించాడు. ఆ తర్వాత తన వ్యవహారాన్ని ఓపెన్ గా చెప్పేశాడు. ఇప్పుడు సోఫీతో కలిసి అతడు విహారయాత్రలో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. బహుశా అక్కడ ఉన్నది మాల్దీవులు అని అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోఫీతో కలిసి ధావన్ వర్కౌట్ లు కూడా చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు.. సోఫీ – ధావన్ జంట బాగుందని నెటిజన్లు కితాబు ఇస్తున్నారు. ప్రేమ, వైవాహిక జీవితం విఫలమైన తర్వాత.. సోఫీ ద్వారా ధావన్ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడని.. అతడికి అంతా మంచే జరగాలని అభిమానులు కోరుతున్నారు.. ప్రేయసితో చిల్ అవుతూ ఒత్తిడి దూరం చేసుకుంటున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ” ధావన్ మైదానంలో దూకుడుగా ఉంటాడు.. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు.. కానీ వైవాహిక జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు కొత్త తోడు వెతుక్కుని తన ఒత్తిడిని దూరం చేసుకుంటున్నాడని” అభిమానులు పేర్కొంటున్నారు.