Shikhar Dhawan : శిఖర్ ధావన్ టీమిండియాలో గబ్బర్ గా పేరు తెచ్చుకున్నాడు. సూపర్ ఆటగాడిగా పేరుపొందాడు. ఎడమ చేతివాటంతో వీరవిహారం చేశాడు. ఓపెనర్ గా టీమిండియాకు గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. భారీగా పరుగులు చేసి టీమ్ ఇండియాకు తిరుగులేని విజయాలు అందించాడు. ఆట తీరుతో తిరుగులేని రికార్డులు అందుకున్న ధావన్.. ఆయేషా ముఖర్జితో ప్రేమ.. ఆమె ద్వారా ఓ కుమారుడికి తండ్రి కావడం.. వంటి విషయాలతో సంచలనం సృష్టించాడు. ఎందుకంటే ఆయేషాముఖర్జీకి గతంలోనే వివాహం జరిగింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శిఖర్ ధావన్ ద్వారా ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. మొదటి భర్తతో ఆమె విడాకులు అప్పటికే తీసుకొని ఉంది. ప్రొఫెషనల్ గా ఆయేషా ముఖర్జీ బాక్సర్. టీమిండియా మాజీ ఆటగా హర్భజన్ సింగ్ కు ఆయేషా ముఖర్జీ ఫ్రెండ్. అతని ద్వారా శిఖర్ ధావన్ కు ఆమె పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. కాకపోతే అప్పటికే మొదటి భర్త ద్వారా విడాకులు తీసుకోవడంతో.. శిఖర్ ధావన్ తో ఆయేషా ముఖర్జీ పెళ్లికి ఒప్పుకుంది. మొదట్లో వీరిద్దరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అది విడాకులకు దారితీసింది. ప్రస్తుతం ఆయేషా తన పిల్లలతో ఆస్ట్రేలియాలో ఉంటోంది. ఇటీవల తన కుమారుడితో కూడా మాట్లాడనివ్వడం లేదని శిఖర్ ధావన్ సంచలన ఆరోపణలు చేశాడు.
Also Read : రక్తం ఉడికి పోతోంది.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నా: శిఖర్ ధావన్
ప్రేమయాణం మొదలుపెట్టాడు
శిఖర్ ధావన్ కు ఆమధ్య టీమిండియా లెజెండరీ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ కు ప్రేమ బంధం సాగుతోందని ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అవన్నీ కూడా ఊక దంపుడు కబుర్లేనని తేలిపోయాయి. ఇక శిఖర్ ధావన్ ఐలాండ్ దేశానికి చెందిన సోఫిషైన్ తో ప్రేమలో ఉన్నాడు. ఆమెతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాదు నా ప్రేమ అంటూ లవ్ ఎమోజి దానికి క్యాప్షన్ పెట్టాడు.. ఇక దీనికి భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, సోఫీ షైన్ లైక్ కొట్టారు. ఇటీవల టీమిండియా చాంపియన్స్ దుబాయ్ వేదికగా అడినప్పుడు శిఖర్ ధావన్, సోఫీ షైన్ అక్కడికి వెళ్లారు.. జంటగా మ్యాచులు చూశారు. అప్పట్లోనే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు శిఖర్ కూడా తను ప్రేమలో ఉన్నట్టు స్పష్టం చేశాడు. ఆమె సమక్షంలోనే అందమైన అమ్మాయి తన మనసు దోచుకుందని వ్యాఖ్యానించాడు. దానికి సోఫీ ముసి ముసి నవ్వులు నవ్వింది. దీంతో అప్పటికే అందరికీ వారిద్దరి మధ్య ఉన్న సంబంధం పై క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు దానిని అధికారికం చేస్తూ శిఖర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
Also Read : మొన్న హార్దిక్.. నిన్న చాహల్.. నేడు శిఖర్ ధావన్.. సెలబ్రిటీలకు ఇది అలవాటే..