Sherfane Rutherford Land: మామూలుగా ఒక టోర్నమెంట్లో లేక ఒక సిరీస్లో అద్భుతంగా రాణించిన ప్లేయర్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనే టైటిల్ను ఇవ్వడంతో పాటు బహుమతి కింద కొత్తగా వచ్చిన బైక్ లేక కార్ అది కాకపోతే భారీ మొత్తంలో నగదు అందజేయడం జరుగుతుంది. అయితే కెనడాలో జరిగినటువంటి గ్లోబల్ టీ20 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సీరియస్ గా నిలిచిన మాంట్రీల్ టైగర్స్ కు చెందిన ఒక ఆటగాడికి కనీవినీ ఎరుగని బహుమతి అందివ్వడం జరిగింది.
కెనడా వేదికగా ఆగస్టు ఆరవ తారీఖున జరిగిన గ్లోబల్ టీ 20 ఫైనల్ మ్యాచ్ నిర్వాహకులు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కు అందజేసిన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ సదరు ప్లేయర్ కి అందించింది ఏ ట్రోఫీనో లేక బ్యాంక్ చెక్కో కాదు. ఏకంగా అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచినందుకు అర ఎకరా భూమిని బహుమతిగా పొందాడు.
భూమి అంటే ఎక్కడో కొండల్లోనూ గుట్టల్లోనూ అనుకుంటున్నారేమో.. కానీ కాదు అతనికి అమెరికాలో అరయకరా భూమిని కేటాయించారు. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ఆరవ తారీఖున కెనడాలో జరిగినటువంటి టీ 20 ఫైనల్ లో తలపడిన సర్రే జాగ్వార్స్ – మాంట్రీల్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో సర్రే టీమ్ 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన మాంట్రీల్ టైగర్స్ చివరి బంతిలో సిక్స్ కొట్టి బాల్ బౌండరీ దాటించి ,విజయం అందుకుంది.
ఈ మ్యాచ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మాంట్రీల్ బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. ఎదుర్కొన్న 29 బంతులలో, 3 ఫోర్లు, 2 సిక్స్లు సాధించి 38 పరుగులు రాబట్టి నాటౌట్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటుగా మొత్తం సీరిస్ లో మంచి ప్రదర్శన కనబరిచినందుకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా రూథర్‌ఫర్డ్ అవార్డు అందుకున్నాడు.
రూథర్ఫర్డ్ ఈ టోర్నీ మొత్తం మీద ఆడిన 9 మ్యాచ్‌లు, 8 ఇన్నింగ్స్‌లలో 44 సగటు స్కోర్ తో 220 పరుగులు సాధించాడు. అలాగే వీటిలో ఒక అర్థ సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా సెలెక్ట్ అయిన రూథర్ఫర్డ్ కు నిర్వాహకులు అమెరికాలో అరయకరం భూమిని బహుమతిగా ఇచ్చారు. ఇదే విషయాన్ని జీటీ 20 కెనడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియపరచింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు ప్రజెంట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి.. రూథర్ఫోర్డ్ కి ఇది ఎంతో బిజీగా ఉండే టైం అని మెన్షన్ చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ,ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ ,ఫ్లిప్ చాలెంజ్ అవార్డు ఇలా మొత్తం నాలుగో అవార్డులు రూథర్ఫోర్డ్ కే దక్కడం విశేషం. ఒక్క మ్యాచ్ తో ఆ ప్లేయర్ లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ను అందుకున్నాడు అని ఈ ట్వీట్ చూసిన కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.