Shashank Singh: ఐపీఎల్ లో డెత్ ఓవర్లలో 12కు మించి రన్ రేట్ సాధించడం అసాధ్యం. పైగా మైదానం బౌలింగ్ కు టర్న్ అవుతున్న నేపథ్యంలో అది మరింత కష్టం. కానీ దీనిని సాధ్యం చేసి చూపించాడు.. పంజాబ్ జట్టును గెలిపించాడు. అది కూడా గుజరాత్ ను వారి సొంతమైదానంలో మట్టి కరిపించాడు. అతడే శశాంక్ సింగ్. గుజరాత్ జట్టుతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ ఎవరు ఈ శశాంక్ సింగ్? పంజాబ్ జట్టు ఎలా ఇతడిని కొనుగోలు చేసింది? ఇతడి నేపథ్యం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
శశాంక్ సింగ్ ను పంజాబ్ జట్టు పొరపాటున కొనుగోలు చేసిందట. వాస్తవానికి ఐపీఎల్ లో జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లను కొనుగోలు చేసేటప్పుడు వారి పూర్వ చరిత్ర పరిశీలిస్తాయి. వారి పూర్తి సమాచారాన్ని సేకరిస్తాయి. ఆటగాడికి ఎంత చెల్లించాలి? అతడి స్థాయి ఏంటి? ఎలాంటి వాళ్ళను ఎంచుకోవాలి? ఈ అంశాలు ముందుగానే యాజమాన్యాలకు తెలుస్తుంది. కానీ ఒక్కోసారి జట్ల యాజమాన్యాలు పొరబాట్లు చేస్తాయి. అలా పంజాబ్ జట్టు పొరబాటు చేసి కొనుగోలు చేసిన ఆటగాడు.. క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచాడు. పంజాబ్ ఆయాచిత వరం లాగా మారాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో గెలిపించాడు. అతడే శశాంక్ సింగ్. 29 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. డెత్ ఓవర్లలో దూకుడు గా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించాడు. శంశాంక్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అతడి బ్యాటింగ్ స్థాయిని..
పంజాబ్ లో ధావన్, జానీ బెయిర్ స్టో, సికందర్ రజా వంటివారు విఫలమైనప్పటికీ.. శశాంక్ చివరి వరకు నిలబడ్డాడు. విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను పూర్తి చేశాడు. అశు తోష్ శర్మ (31) సహకరించడం కూడా శశాంక్ సింగ్ కు ప్లస్ అయింది. అశు తోష్ ఆడిన ఆట అభిమానులను అలరించింది. అతడు కొట్టిన షాట్స్ చూసి పంజాబ్ జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. శశాంక్ సింగ్ ను పంజాబ్ జట్టు 2024 వేలంలో పొరపాటున కొనుగోలు చేసింది. వాస్తవానికి 19 సంవత్సరాల శశాంక్ సింగ్ కొనుగోలు చేయబోయి.. 32 సంవత్సరాల శశాంక్ సింగ్ ను కొనుగోలు చేసింది.. కొనుగోలు చేసిన తర్వాత పొరపాటు గుర్తించినప్పటికీ.. పరువు పోతుందనే ఉద్దేశంతో పంజాబ్ జట్టు శశాంక్ సింగ్ తమ లిస్టులోనే ఉన్నాడంటూ ప్రకటించింది.
శశాంక్ సింగ్ ను రాజస్థాన్ జట్టు 2019లో 30 లక్షలకు కొన్నది. ఆ సీజన్, తర్వాతి సీజన్ లో అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లో 20 లక్షల కనీస ధరకు హైదరాబాద్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. ఆ సీజన్లో పది మ్యాచ్ లలో 69 పరుగులు మాత్రమే చేసిన శశాంక్ నిరాశపరిచాడు. ఇక ప్రస్తుత సీజన్లో పొరపాటున పంజాబ్ జట్టులోకి వచ్చిన అతడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలిచిందంటే దానికి కారణం శశాంక్ సింగే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2️⃣ Points ✅
Young guns Shashank Singh and Ashutosh Sharma win it for @PunjabKingsIPL
They get over the line as they beat #GT by 3 wickets
Scorecard ▶️ https://t.co/0Sy2civoOa #TATAIPL | #GTvPBKS pic.twitter.com/m7b5f8jLbz
— IndianPremierLeague (@IPL) April 4, 2024