Summer Holidays : వేసవి కాలం వచ్చింది. ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అంతేనా బయటకు వెళ్ళాలి అంటే వెన్నులో చెమటతో, పాటు వణుకు కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. మరి ఆ రేంజ్ లో ఎండ ఉంది. ఇవన్నీ ఒకెత్తు అయితే పిల్లలకు స్కూల్ కి హాలిడేస్ రాబోతున్నాయి.అదేనండి వేసవి సెలవులు ఇవ్వబోతున్నారు కదా. అంటే వీరితో పెద్ద టాస్క్ ఉండనుంది అన్నమాట. ఒరెయ్ ఎండలో తిరగకురా అని అమ్మ ఎంత చెప్పినా వినడే. అమ్మ నేను ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తున్నా అంటూ కూతురు వెళ్తుంది. ఎండలో ఆడడం, తినకపోవడం చేస్తుంటారు. వీరిని ఆపడం కూడా కష్టమే.
మరి ఆడుకోవడంలో తప్పులేదు కానీ ఎండ కదా కాస్త భయపడాల్సిందే. ఇంతకీ ఈ ఎండాకాలంలో సెలవులకు అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు పంపిస్తున్నారా? లేదా ఇంటి వద్దే ఉంచుతున్నారా? ఎక్కడ ఉన్న కూడా వేసవి మొత్తం హృదానే కదా. ఏదైనా నేర్పించాలి అనుకుంటున్నారా? అవును కచ్చితంగా నేర్పించండి. మీ పిల్లలు మరీ చిన్న వారు అయితే వారికి డ్యాన్స్ మీద ఆసక్తి ఉంటే డ్యాన్స్ నేర్పించండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కు పంపించండి. లేదంటే గేమ్స్ లో నిష్ణాతులు కావాలి అనుకుంటే కోచింగ్ సెంటర్లు ఉంటాయి అక్కడికి అయినా పంపండి.
గేమ్స్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి. సింగింగ్, సంప్రదాయ నృత్యాలు అంటూ చాలా ఉంటాయి. కాస్త మీ పిల్లలు పెద్దవారు అయితే కంప్యూటర్ నేర్చుకోవడానికి, అందులో మీకు నచ్చిన కోర్సును ఎంచుకొని మరీ పంపించండి. చదువు మాత్రమే ఉంటే సరిపోదు.చదువుతో పాటు ఇతర రంగాలలో కూడా యాక్టివ్ గా ఉంటేనే పిల్లల షార్ప్ గా ఉంటారు. వేసవిని హృదా చేయడం కంటే వారికి ఇలాంటి యాక్టివిటీస్ నేర్పించడం బెటర్. ఇక కరాటే, కుంగ్ఫూ వంటివి కూడా నేర్చించవచ్చు.
యాక్టింగ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. యాక్టింగ్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వైపు కూడా పిల్లలను పుష్ చేయవచ్చు. మీ పిల్లలకు ఏ రంగం మీద ఆసక్తి ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన శిక్షణ ఇప్పించడం వల్ల వారికి మరింత ప్లస్ అవుతుంది. ఒకసారి స్కూల్స్ ప్రారంభం అయితే మళ్లీ వేసవి సెలవులు వచ్చే వరకు వారికి సమయం ఉండదు. సో హాలీడేస్ ను జాలీడేస్ గా, కాస్త యూస్ అయ్యే డేస్ లాగా కూడా ఉపయోగించుకోండి.