Shane Warne: కళ్ళున్న వాడు ముందు చూస్తాడు.. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు.. వింటుంటే ఏదో సినిమా డైలాగ్ లాగా ఉంది కదా. దీనిని నిజం చేసి చూపించాడు ఆస్ట్రేలియా దివంగత లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్. అతడు గతించిపోయినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ఏకంగా 460 కోట్ల వరకు వచ్చాయి.. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది..
Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే.. క్రికెటర్ గా షేన్ వార్న్ కు గొప్ప చరిత్ర ఉంది. అతడు ఆస్ట్రేలియా జట్టు సాధించిన అనేక విజయాలను ముఖ్యపాత్ర పోషించాడు. అంతేకాదు.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తొలి సారధిగా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్లో రాజస్థాన్ జట్టుకు ట్రోఫీని అందించాడు. తన మాయాజాలమైన బౌలింగ్ తో ఫైనల్ మ్యాచ్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించాడు. తద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ఛాంపియన్ గా అవతరించింది.
షేన్ వార్న్ కు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. ఐపీఎల్ ప్రారంభంలో నాలుగు సీజన్లకు కలిపి అతడు కేవలం 9.35 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అదే అప్పట్లో అతడు అంత మాత్రమే తీసుకోవడంతో చాలామంది నవ్వుకున్నారు. ఇక్కడే అతడు తన తెలివిని ప్రదర్శించాడు. తన రిటైర్మెంట్ డీల్ లో భాగంగా ఆడిన ప్రతి సీజన్లో కూడా 0.75 శాతం వాటా కావాలని నిబంధన విధించాడు.
నాలుగు సంవత్సరాలలో మొత్తం అతడు రాజస్థాన్ జట్టులో మూడు శాతం వాటా సొంతం చేసుకున్నాడు. తద్వారా రాజస్థాన్ రాయల్స్ ఇటీవల చేతులు మారింది. మొత్తంగా 15, 301 కోట్లకు అమ్ముడుపోయింది. జట్టులో మూడు శాతం వాటా ఉండడంతో వార్న్ 460 కోట్ల వరకు వచ్చాయి. అయితే వార్న్ జీవించి లేకపోవడంతో.. అతడి పిల్లలకు ఈ డబ్బులను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చెల్లించింది.
” షేన్ వార్న్ కు దూర దృష్టి ఎక్కువ. అందువల్లే అతడు మ్యాచ్ ఫీజు విషయంలో ముందుగా ఒక ఒప్పందానికి వచ్చాడు. డబ్బులు తీసుకోకుండా వాటా కావాలని అడిగాడు. ఆ వాటా ఇన్నాళ్లకు ఇన్ని కోట్లకు చేరుకుంది. మిగతా ప్లేయర్లు డబ్బులు తీసుకుంటే.. అతడు మాత్రం వాటా కావాలని కోరుకున్నాడు. ఇది అతడి దూర దృష్టిని సూచిస్తుంది. అతడు జీవించలేకపోయినప్పటికీ పిల్లలకు 460 కోట్ల వరకు వచ్చాయంటే మామూలు విషయం కాదని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
