https://oktelugu.com/

Shamar Joseph: తొలి సిరీస్ తోనే ఆ ఆటగాడికి ఐసీసీ అవార్డు.. జట్టులో సంబరాలు

గబ్బా లో మైదానం ఆస్ట్రేలియా కంచుకోట. ఈ స్టేడియంలో షమర్ నిప్పులు చెరిగాడు. గులాబీ రంగు బంతి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బొటన వేలికి గాయంతో రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడిన అతడు.. ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 17, 2024 / 05:18 PM IST
    Follow us on

    Shamar Joseph: క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ చూపే ఆటగాళ్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురస్కారాలు అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాదిలో జనవరి నెలలో వివిధ టోర్నీలలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆటగాళ్లకు ఐసీసీ పురస్కారాలు ప్రకటించింది. వెస్టిండీస్ జట్టుకు చెందిన యువ పేసర్ సమర్ జోసెఫ్ తొలి టెస్ట్ సిరీస్ లోనే తన బౌలింగ్ ప్రతాపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా జట్టుతో గబ్బా మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ప్రకంపనలు సృష్టించాడు.. 7 వికెట్లు తీసి వెస్టిండీస్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అతడి బౌలింగ్ తీరు చూసిన ఐసీసీ జనవరి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి ఎంపిక చేసింది. సమర్ జోసెఫ్ .. ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ పోప్, ఆసీస్ పేస్ బౌలర్ హేజిల్ వుడ్ ను పక్కన నెట్టి మరీ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. సమర్ జోసెఫ్ ఐసీసీ పురస్కారం దక్కించుకోవడంతో వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

    గబ్బా లో మైదానం ఆస్ట్రేలియా కంచుకోట. ఈ స్టేడియంలో షమర్ నిప్పులు చెరిగాడు. గులాబీ రంగు బంతి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బొటన వేలికి గాయంతో రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడిన అతడు.. ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ విషయంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆరంగట్రం సిరీస్ లోనే 7-68 గణాంకాలు నమోదు చేసి దిగ్గజాలైన క్రికెటర్లను తన వైపు చూసుకునేలా చేశాడు. షమర్ ధాటికి 30 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.

    ఇక మహిళల విభాగంలో ఐర్లాండ్ క్రికెటర్ అమీ హంటర్ ఉత్తమ క్రీడాకారిణి పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో ఆమెతోపాటు ఆస్ట్రేలియా ప్లేయర్లు బేత్ మూనీ, అలీసా హేలీ ఈ పురస్కారం కోసం పోటీపడ్డారు.. ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు హంటర్ దక్కించుకుంది. దీంతో ఆమెకు ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్” పురస్కారం ప్రకటించింది.

    ఇక భారత పర్యటనలో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ పోప్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ ఇన్నింగ్స్ లో 196 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే లక్ష్యాన్ని చేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన భారత జట్టును ఇంగ్లాండ్ బౌలర్ టామ్ హర్ట్ లే దెబ్బ కొట్టాడు. కీలకమైన ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించాడు.. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హజీల్ వుడ్ పాకిస్తాన్ జట్టుతో సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో అదరగొట్టాడు. ఏకంగా 11.63 సగటుతో 13 వికెట్లు తీసి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. ఈ మేరకు వివరాలను ఐసీసీ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రకటించింది.