Amanchi Krishna Mohan: ఆమంచి కృష్ణమోహన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. చీరాల అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఆమంచి. ఆ నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి రికార్డు సృష్టించారు. కానీ జగన్ ఆయన పొలిటికల్ కెరీర్ ను చించేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ లేదని తేల్చేశారు. రోశయ్య ఆశీస్సులతో రాజకీయాల్లో ప్రవేశించారు ఆమంచి కృష్ణమోహన్. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. కానీ 2014 ఎన్నికల్లో జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ కు తన సత్తా ఏంటో చూపించారు.
వైసీపీని విభేదించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఖరారైనా… సరిగ్గా ఎన్నికల ముంగిట వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఎంతో సంతోషపడ్డారు. తనకు ఇక తిరుగు లేదని భావించారు. కానీ జగన్ ఆయన ఆశలను నీరుగార్చారు. టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలోకి ఆహ్వానించి.. ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు కు పంపించారు. ఇప్పుడు పరుచూరు టికెట్ కూడా ఆమంచికి దక్కేలా లేదు. ఎక్కడో అమెరికాలో ఉన్న ఓ నాయకుడిని రప్పించి పోటీ చేయించడానికి డిసైడ్ అయ్యారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పొలిటికల్ సర్కిల్లో నిలబడాల్సి వచ్చింది.
2014 ఎన్నికలను రిపీట్ చేయాలని ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా చాటాలని నిర్ణయానికి వచ్చారు.మరోవైపు ఆయన సోదరుడు ఇప్పటికే జనసేనలో చేరారు. యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఇక్కడ పార్టీ నుంచి ఫిరాయించిన కరణం బలరామును ఎలాగైనా మట్టి కరిపించాలని టిడిపి నాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు ఆమంచి సైతం జగన్ కు గట్టి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. ఒకవేళ చీరాల స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థిత్వాన్ని ఆలోచించే అవకాశం ఉంది. జనసేన టికెట్ దక్కకుంటే మాత్రం ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.