spot_img
Homeక్రీడలుక్రికెట్‌Cameron Green Poor Performance IPL 2026: 25.20 కోట్ల ఆటగాడు.. చేసింది 20 పరుగులు.....

Cameron Green Poor Performance IPL 2026: 25.20 కోట్ల ఆటగాడు.. చేసింది 20 పరుగులు.. ఏమయ్యా షారుక్ ఖాన్ ముందుచూపు ఉండొద్దా..

Cameron Green Poor Performance IPL 2026: దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టేయమని అన్నాడట వెనకటికి ఒకడు. ఈ సామెత మాదిరిగానే ఉంది బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పరిస్థితి. ఆస్ట్రేలియా జట్టులో రెండు ఇన్నింగ్స్ గట్టిగా ఆడాడని.. ఎత్తుగా ఉన్నాడని.. సత్తా చూపిస్తాడని అనుకొని కోట్లు కుమ్మరించాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 కోట్లు ముట్ట చెప్పాడు. రాశి ఘనం..వాసి శూన్యం అన్నట్టుగా అతని పరిస్థితి ఉంది. ఈ ఐపీఎల్లో అతని తీరు చూస్తే ఈ మాత్రం దానికి అతడికి అన్ని డబ్బులు ఖర్చు చేశారా అనిపిస్తోంది.

ఐపీఎల్లో 2026 సీజన్ కు సంబంధించి జరిగిన మెగా వేలంలో గ్రీన్ కు భారీగా ధర లభించింది. ఏకంగా 25 కోట్లకు మించి డబ్బులు షారుక్ ఖాన్ చెల్లించాడు. అతడు తన జట్టులో ఉన్న అద్భుతమైన ఆయుధమని పేర్కొన్నాడు. 2026 ఐపిఎల్ సీజన్లో దుమ్ము రేపుతాడని చెప్పాడు. అతడు బీభత్సంగా ఆడే క్షణం కోసం ఎదురుచూస్తున్నానని అంచనాలను అమాంతం పెంచాడు. తీరా చూస్తే గ్రీన్ ఆ స్థాయిలో కాదు కదా.. కనీసం గల్లి స్థాయి ఆట కూడా ఆడలేకపోతున్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో పది బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు గ్రీన్. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయితే రెండు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి.. అత్యంత నిర్లక్ష్యంగా రనౌట్ అయ్యాడు.. అతడు రన్ అవుట్ కావడం జట్టు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఓ అలెన్ విధ్వంసం సృష్టిస్తే.. దానికి గ్రీన్ కొనసాగింపుగా ఆడతాడని అందరూ అనుకున్నారు. అలాకాకుండా.. నిర్లక్ష్యంగా పరుగు పెట్టి దారుణంగా రన్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి గ్రీన్ నుంచి ఇటువంటి ప్రదర్శనను కోల్ కతా అభిమానులు ఏమాత్రం ఊహించలేకపోయారు.

గతంలో బెంగళూరు జట్టు తరుపున మ్యాక్స్ వెల్ ఆడేవాడు. అతడి మీద కూడా భారీగా అంచనాలు ఉండేవి. భారీగా ధర దక్కించుకున్నప్పటికీ.. అతడు వరుసగా విఫలం కావడంతో బెంగళూరు జట్టు దూరం పెట్టింది. చివరికి ఆస్ట్రేలియా జాతీయ జట్టు కూడా అతనికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇప్పుడు గ్రీన్ కూడా అదే స్థాయిలో ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి కూడా భవిష్యత్తు కాలంలో అటువంటి అనుభవం ఎదురవుతుందని..మాక్స్ వెల్ లాగానే ఉండిపోవాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version