Perni Nani Comments On KCR: రాజకీయాలు ఒకేలాగా ఉండవు. రాజకీయ నాయకుల మధ్య బంధాలు కూడా ఒకే విధంగా ఉండవు. అవసరాల ఆధారంగా రాజకీయాలు మారిపోతూ ఉంటాయి. రాజకీయ నాయకుల మధ్య స్నేహాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఒకప్పుడు వైసిపి, గులాబీ పార్టీల మధ్య కాస్త వైరం ఉండేది. కానీ ఇప్పుడు స్నేహం పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో వైసిపి.. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలని పరస్పరం కోరుకుంటున్నాయి. అందువల్లే వారి వారి సొంత మీడియాలో జగన్ మీద.. కెసిఆర్ మీద ఏమాత్రం వ్యతిరేకతను ప్రదర్శించడం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద.. అక్కడ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి వైసిపి, గులాబీ పార్టీల మీడియా సంస్థలు.
వైసిపి, బీఆర్ఎస్ మధ్య స్నేహం ముంజేతి కంకణం లాగానే కనిపిస్తోంది. దీనిని బహిరంగంగా చెప్పడంలో ఆ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఏమాత్రం వెనుకాడటం లేదు. పైగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ వచ్చారు.. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కూడా వచ్చారు. కెసిఆర్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హాజరయ్యారు. ఏపీని బంగారు తునక చేస్తానని అన్నారు. పోతిరెడ్డిపాడు కు సహకరించారు. 2023 లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నప్పుడు ఇక్కడ సెంటిమెంట్ రగిలించడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదకి ఏపీ పోలీసులను పంపించాడు జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మధ్య.. జగన్ మధ్య ఉన్న రాజకీయ సాన్నిహిత్య సంబంధాన్ని అనేక రకాలుగా వివరించవచ్చు.
అయితే ఇప్పుడు కెసిఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి కాదు. రాజకీయంగా కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో సమస్యలు ఆయనను కాలు కదపకుండా చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైసీపీకి చెందిన పేర్ని నాని అనే నాయకుడు కేసీఆర్ కాళ్లు పట్టుకోడానికి వెనుకాడ లేదు. మచిలీపట్నం ప్రాంతానికి చెందిన ఈ నాయకుడు సరిగ్గా గురువారం విలేకరుల ముందుకు వచ్చారు. మచిలీపట్నం ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన గృహాలను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో విలేకరుల ముందుకు వచ్చిన నాని చిందులు తొక్కారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని.. ఇప్పుడు మచిలీపట్నంలో గృహాలను కూల్చివేసిన అధికారులకు హైదరాబాదులో ఇళ్ళు ఉన్నాయని .. ఎటువంటి అనుమతులు లేకుండానే వాటిని నిర్మించారని.. 2028 లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆ అధికారుల గృహాలను హైదరాబాదులో తొలగిస్తామని.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుంటామని నాని వ్యాఖ్యానించారు. దీంతో వైసిపి, బీఆర్ఎస్ మధ్య ఉన్న సంబంధం బయటపడిందని కూటమి నేతలు అంటున్నారు. 2028లో ఎన్నికలు జరిగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదని.. అలాంటిది ఇప్పటికే పేర్ని నాని తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తీర్మానించారని.. మచిలీపట్నం పట్టణంలో పనిచేస్తున్న అధికారుల గృహాలను కూల్చివేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టిడిపి నేతలు అంటున్నారు.
పేర్ని నాని ఆవేశపడి అన్నాడో.. అధికారులను బెదిరించడానికి అన్నాడో తెలియదు గాని. గులాబీ పార్టీ కరపత్రం ఆయన వ్యాఖ్యలకు ఏమంత ప్రయారిటీ ఇవ్వలేదు. గులాబీ పార్టీ సోషల్ మీడియా.. వైసిపి కూడా పట్టించుకోలేదు
