Sarfaraz, Dhruv Jurel: సర్ఫరాజ్, ధృవ్ జురెల్ కు జాక్ పాట్

ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో వీరిద్దరికీ బీసీసీఐ అవకాశాలు కల్పించింది. ఇద్దరిదీ పేద కుటుంబం కావడంతో.. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 19, 2024 3:08 pm

Sarfaraz, Dhruv Jurel get BCCI central contracts

Follow us on

Sarfaraz, Dhruv Jurel: క్రికెట్ లో వర్థమాన ఆటగాళ్లకు అరుదుగా అవకాశాలు లభిస్తుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటేనే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. లేకుంటే స్థానచలనం అనివార్యమవుతుంది. ఇలా టీమ్ ఇండియా జట్టులోకి ఎంత మంది క్రీడాకారులు అవకాశాలు రాగానే వచ్చారు. వారిని వారు నిరూపించకపోవడంతో వచ్చినంత వేగంగానే వెనక్కి వెళ్లిపోయారు. కొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారిలో సర్ప రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో వీరిద్దరికీ బీసీసీఐ అవకాశాలు కల్పించింది. ఇద్దరిదీ పేద కుటుంబం కావడంతో.. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. భారత జట్టుకు కీలక సమయంలో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా భారత జట్టు ఇంగ్లాండ్ పై 4-1 తేడాతో టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంది. అయితే వీరిద్దరికీ టెస్ట్ క్రికెట్లో అంతగా అనుభవం లేకపోయినప్పటికీ.. వీరు ఆడిన తీరు పట్ల బీసీసీఐ పెద్దలు ఫిదా అయిపోయారు. ఇటీవల సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించినప్పటికీ.. పై ఇద్దరు క్రీడాకారులకు అవకాశం లభించలేదు. అయితే సోమవారం భేటీ అయిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సర్ఫ రాజ్, ధృవ్ జురెల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

సర్ఫ రాజ్, ధృవ్ జురెల్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో ప్రతిభ చూపించిన నేపథ్యంలో వారిద్దరికీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. మూడు టెస్టులు మాత్రమే ఆడిన నేపథ్యంలో వారిద్దరికీ భారత క్రికెట్ బోర్డు “సీ” గ్రేడ్ కాంట్రాక్ట్ ఖాయం చేసింది. బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కిన నేపథ్యంలో సర్ఫ రాజ్, ధృవ్ జురెల్ ఏడాదికి కోటి రూపాయల దాకా ఆర్జిస్తారు. టెస్ట్ క్రికెట్లో వీరిద్దరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అందువల్లే వీరి ఆట తీరును గుర్తించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రాజ్ కోట్ టెస్ట్ ద్వారా సర్ఫ రాజ్, ధృవ్ జురెల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్లో సర్ఫ రాజ్ అర్థ సెంచరీ సాధించాడు. రెండవ ఇనింగ్స్ లోనూ అదే జోరు కొనసాగించాడు. ధృవ్ జురెల్ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్ లో 46 పరుగులు చేస్తే.. రాంచీ టెస్ట్ లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కులదీప్ యాదవ్ తో కలిసి భారత జట్టును ఆల్ అవుట్ ప్రమాదం నుంచి బయట పడేశాడు. పదిపరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గిల్(54) తో కలిసి భారత్ ఇంగ్లీష్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది.

గతంలో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ స్థానం కోల్పోయారు. వీరి కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వారిద్దరూ రంజీ మ్యాచ్ లు ఆడక పోవడం వల్లే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలిసింది. అయితే త్వరలో వారి కాంట్రాక్టు పునరుద్ధరణ పై బీసీసీఐ సమావేశమయ్యే అవకాశం ఉంది.