Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson: టి20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ పరిస్థితి ఏంటి? కెరియర్ క్లోజేనా?

Sanju Samson: టి20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ పరిస్థితి ఏంటి? కెరియర్ క్లోజేనా?

Sanju Samson: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో ఎంతో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు. అందులో సంజు శాంసన్ ముందు వరుసలో ఉంటాడు. బంతిని బలంగా కొట్టడంలో అతడు నేర్పరి. వికెట్ల మధ్య సులువుగా పరుగులు తీయడంలో అతడు సొగసరి. అతడి గణాంకాలు టి20 లలో స్థాయిని చూపిస్తాయి.

గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం అన్నట్టుగా సంజు శాంసన్ పరిస్థితి మారిపోయింది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్లో సంజు విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్ లలో అతడు కేవలం 46 పరులు మాత్రమే చేయగలిగాడు. సగటు 9.20 అంటే అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి అతడి కంటే దిగువ స్థాయిలో వచ్చి బ్యాటింగ్ చేసిన రింకు సింగ్ ఎక్కువ పరుగులు చేయడం విశేషం.

సంజు ప్రతిభ ఏ మాత్రం బాగో లేకపోవడంతో అతడికి టి20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. గత డిసెంబర్లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో మేనేజ్మెంట్ సంజు శాంసన్ ను పక్కన పెట్టింది. అతని స్థానంలో గిల్ ను ఎంపిక చేసింది. గిల్ కూడా సరిగ్గా ఆడ లేకపోవడంతో అతని మీద మేనేజ్మెంట్ వేటు వేసింది. సంజు ను టి20 వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ ఓపెనర్ గా సెలెక్ట్ చేసింది. దానికంటే ముందే అతడిని న్యూజిలాండ్ సిరీస్ లో ఓపెనర్ గా ఆడించింది. అయితే ఈ సిరీస్లో సంజు ఏమాత్రం సత్తా చూపించలేకపోయాడు. ఫలితంగా అతని కెరియర్ ప్రమాదంలో పడింది.

సంజు విఫలమవుతున్న వేళ ఇషాన్ కిషన్ ఫామ్ లోకి వచ్చాడు. న్యూజిలాండ్ సిరీస్ లో పరుగుల మోత మోగించాడు. సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ ను నాలుగో మ్యాచ్ కు మేనేజ్మెంట్ దూరం చేసింది. కానీ ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఈ ప్రకారం చూసుకుంటే ఇషాన్ కిషన్ ఓపెనర్ గా టి20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంది. మరోవైపు కిషన్ స్థానంలో శివం దుబే లేదా తిలక్ వర్మ ఆడతాడు. రింకు సింగ్.. హార్థిక్ పాండ్యా.. మిగతా స్థానాలలో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version