Sania Mirza sensational decision: భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ గా సానియా మీర్జా అనేక రికార్డులను సృష్టించింది. అనేక విజయాలను అందుకుంది. విదేశాల మీద సంచలన ప్రదర్శన చేసి టీమిండియా కు అద్భుతమైన గౌరవాన్ని అందించింది.
సానియా మీర్జా టెన్నిస్లో చూపించిన తెగువ వల్ల చాలామంది అమ్మాయిలు ఆ క్రీడను తమకు కెరియర్ గా మార్చుకుంటున్నారు. దీనిని బట్టి సానియా మీర్జా టెన్నిస్లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా ఎంతో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించింది. ఎన్నో రివార్డులను.. అవార్డులను.. ట్రోఫీలను అందుకుంది. అందువల్లే ఆమెను చాలామంది అనుసరిస్తారు. అనుకరిస్తారు.
వర్ధమాన ప్లేయర్లకు తన అనుభవాన్ని చెప్పే విధంగా సానియా మీర్జా ఒక అకాడమీ కూడా ఏర్పాటు చేశారు. ఈ అకాడమీలో ఎంతోమంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. టెన్నిస్ కెరియర్ పరంగా సానియా మీర్జాకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది.
గతంలో ఓ బేకరీ నిర్వాహకుడితో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అది రద్దయిందని తెలిసింది. కొద్ది రోజులకు పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడు. టీవీనటిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సానియా మీర్జా తన కొడుకుతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.
సానియా మీర్జా ఇప్పటికీ ఫ్యాషన్ ఐకాన్ గా ఉంది. ఆ మధ్య ఆమె పెళ్లికి సంబంధించి అనేక రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ కూడా నిజం కాదని తేలిపోయింది. ప్రస్తుతం తన టెన్నిస్ అకాడమీని నిర్వహిస్తున్న సానియా మీర్జా.. కొడుకు బాగోగులను కూడా చూసుకుంటున్నది. అయితే కుమారుడి విషయంలో సానియా మీర్జా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
దుబాయిలో తన కుమారుడితో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే దుబాయిలో 210 కోట్లతో భారీ భవనాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు అతనితో అక్కడే స్థిరపడి.. ఉండిపోవాలని సానియా మీర్జా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సానియా మీర్జా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
View this post on Instagram