Mumbai Indians : నిన్న రోహిత్.. నేడు సచిన్.. ముంబైకి వరుస షాక్ ల వెనుక కారణం ఇదే…

అవేంటి అంటే రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తప్పించడంతో సచిన్ టెండూల్కర్ కూడా మెంటర్ గా రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Written By: NARESH, Updated On : December 18, 2023 8:40 pm
Follow us on

Mumbai Indians : రీసెంట్ గా ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది.ఇంక దానికి తగ్గట్టుగానే కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను నియమించింది. ఇక ముంబై యాజమాన్యం రోహిత్ ని కెప్టెన్ గా నుంచి తొలగించడంతో అభిమానులందరూ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో కూడా ముంబై ఇండియన్స్ టీమ్ ని చాలామంది అన్ ఫాలో చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఇక ఇదిలా ఉంటే ముంబై టీమ్ మాత్రం దీని మీద ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.

ఇక దాంతో సోషల్ మీడియాలో మరికొన్ని న్యూస్ లు కూడా వచ్చాయి. అవేంటి అంటే రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తప్పించడంతో సచిన్ టెండూల్కర్ కూడా మెంటర్ గా రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే 2014 నుంచి ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీమ్ కి మెంటర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. అయితే రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించడంతో తను తీవ్ర మనస్థాపానికి గురై తన మెంటర్ పోస్ట్ కి రాజీనామా చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి…

అయితే ఈ విషయం మీద సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఇలాంటివన్నీ రూమర్లు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ముంబై ఇండియన్స్ టీం మెంటర్ గానే కొనసాగుతున్నాను ఫ్యూచర్ లో కూడా కొనసాగుతాను అంటూ ఇక తన మీద వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు. నిజానికి సచిన్ టెండూల్కర్ లాంటి ఒక గొప్ప ప్లేయర్ ముంబై టీం కి మెంటర్ గా ఉండడం ముంబై ఇండియన్స్ టీమ్ కి మొదటినుంచి కలిసొస్తున్న అంశం అనే చెప్పాలి. ప్లేయర్లకు ఏ చిన్న తను ప్రాబ్లం ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని ఎవరి బౌలింగ్ లో ఎలా ఆడాలి ఏ బాల్ ని ఎలా డీల్ చేయాలి అనే దాని మీద ప్లేయర్లకి మంచి అవగాహన కల్పించినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలో సచిన్ టెండూల్కర్ లాంటి ఒక గొప్ప ప్లేయర్ ముంబై ఇండియన్స్ టీం కి మెంటర్ ఉండడం అనేది వాళ్ళు ఒక ధైర్యంగా ఫీల్ అవుతూ వస్తున్నారు.ఇక ముంబై ఇండియన్స్ సాధించిన కప్పుల్లో తప్పకుండా సచిన్ టెండూల్కర్ పాత్ర ముఖ్యమైనదనే చెప్పాలి… ఇక తన కొడుకు అయిన అర్జున్ టెండూల్కర్ ని కూడా ముంబై ఇండియన్స్ టీం తరఫున ఆడిస్తున్నాడు…