Sachin Tendulkar : బ్యాటింగ్ తో సరికొత్త రికార్డులు సృష్టించాడు. సెంచరీలు చేయడంలో అరుదైన ఘనత నెలకొల్పాడు. టెస్ట్, వన్డే.. ఫార్మాట్ ఎలాంటిదైనా.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కొన్ని సందర్భాలు మినహాయిస్తే.. మిగతా అన్నిసార్లు అతడు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. జట్టు అవసరాల దృశ్య బంతితోనూ మాయ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడు అయ్యాడు. జట్టు గెలవాల్సిన సందర్భంలో సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడి.. విజయం అందించాడు. క్రికెట్ కు ఎనలేని సేవలు అందించాడు కాబట్టే.. ఆయనను క్రికెట్ గాడ్ అని పిలుస్తుంటారు. ప్రాంతంతో సంబంధం లేకుండా సచిన్ టెండూల్కర్ ను అభిమానులు ఆరాధిస్తుంటారు. అతడిని ప్రేమిస్తుంటారు. అతడి ఆటను ఆస్వాదిస్తుంటారు. అందువల్లే ఆయన ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుంది..
అరుదైన గౌరవం
క్రికెట్ కు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని అనేక దేశాలు సచిన్ టెండూల్కర్ కు పురస్కారాలు అందించాయి. విశిష్టమైన అవార్డులతో సత్కరించాయి. ఇక మన దేశ ప్రభుత్వం ఏకంగా భారతరత్నతో గౌరవించింది. 2014లో దేశంలోని అత్యున్నత మైన ఈ పురస్కారంతో ఆయనను సత్కరించింది. అయితే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లో సచిన్ టెండూల్కర్ కు గౌరవ సభ్యుడిగా చోటు కల్పించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని సచిన్ టెండూల్కర్ స్వాగతించారని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, ట్వీట్ లో పేర్కొంది..” క్రికెట్ కు సచిన్ అద్భుతమైన సేవలు చేశారు. అజరామరమైన ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నారు. సమకాలీన క్రికెట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు సచిన్ పేరు లేకుండా ఉండదు. అందువల్లే ఆయన గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. అటువంటి గొప్ప ఆటగాడిని సత్కరించుకోవడం మా బాధ్యత. ఇటువంటి పనిచేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉందని” మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ తన ట్వీట్లో వివరించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సచిన్ టెండూల్కర్ ఐదు టెస్టులు ఆడాడు. 58.69 స్ట్రైక్ రేటుతో 449 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మెల్బోర్న్ మైదానంలో నాలుగో టెస్ట్ ఆడుతున్నాయి. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 474 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా స్కోర్ కు ఇంకా 310 పరుగుల దూరంలో ఉంది. క్రీజ్ లో రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) ఉన్నారు.
Congratulations cricket god
The Melbourne cricket club is pleased to announce that former Indian captain @sachin_rt has accepted an Honorary Cricket Membership, acknowledging his outstanding contribution to the game.#SachinTendulkar #Melbournecricketclub pic.twitter.com/eQXENm4bZB
— Anabothula Bhaskar (@AnabothulaB) December 27, 2024