Sachin Tendulkar : టీమిడియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై వాటికి పూర్తి విరుద్ధం. ఎందుకంటే ఆయనకు వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత యంగ్ గా తయారవుతున్నాడు. తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ తో కలిసి బయటికి వెళ్తే.. అతడికి సోదరుడిలాగా కనిపిస్తున్నాడు. ఇక కుమార్తె సారాతో కలిసి బయటికి వెళ్తే ఆమెకు కూడా సోదరుడి లాగానే కనిపిస్తున్నాడు. ఇక అంజలి తో పోల్చుకుంటే వయసులో చిన్నవాడిలాగా అనిపిస్తున్నాడు. సచిన్ లిటిల్ మాస్టర్ అయినప్పటికీ.. క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. పైగా 40+ వయసులో అతడు సత్తా చాటుతున్నాడు. క్రికెట్ టోర్నీలలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
Also Read : చితకొట్టిన సచిన్ సేన.. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి ఎంట్రీ
ప్రస్తుతం సచిన్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో ఆడుతున్నాడు.. టీమ్ ఇండియాను ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. అటువంటి సచిన్ మైదానం అవతల కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. శుక్రవారం హోలీ సందర్భంగా చిన్నపిల్లాడి లాగా తోటి ప్లేయర్లకు సచిన్ రంగులు పూశాడు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ కు రంగులు పూసి తన్మయత్వం చెందాడు. క్రితం రోజు లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో సచిన్ ఆధ్వర్యంలో టీమిండియా ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్ చేరుకుంది. టీమిండియా ఫైనల్ చేరుకోవడంలో యువరాజ్ సింగ్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ వయసులోనూ అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ఫోర్లు, సిక్సర్లతో తాండవం చేశాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియా జట్టుపై ఘనవిజయం సాధించింది. ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో తీవ్రంగా అలసిపోయిన యువరాజ్.. శుక్రవారం ఉదయం 8 గంటలైనా నిద్ర లేవలేదు. దీంతో సచిన్ రంగులు పట్టుకొని.. యువరాజ్ బస చేస్తున్న గది వద్దకు వెళ్లాడు. అతడిపై ఒక్కసారిగా రంగులు చల్లాడు. యువరాజ్ సచిన్ ఆకస్మాత్తుగా రావడంతో ఆశ్చర్యపోయాడు. ఇక యూసఫ్ పటాన్ తోనూ సచిన్ హోలీ సంబరాలు జరుపుకున్నాడు. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా సచిన్ చేత రంగులు పూయించుకున్నాడు. సాధారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు మైదానంలోకి తిరిగి రావడం చాలా వరకు అరుదు. కానీ సచిన్ మాత్రం వాటన్నింటికీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఐదుపదులకు దగ్గరగా ఉన్నప్పటికీ ఒకప్పటిలాగే క్రికెట్ ఆడుతున్నాడు. ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు. ఇక తోటి ఆటగాళ్లతో చిన్నపిల్లాడి లాగా వ్యవహరిస్తున్నాడు. అందుకే సచిన్ ను మాస్టర్ బ్లాస్టర్ అని మాత్రమే కాదు.. క్రికెట్ గాడ్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే క్రికెట్ కు సచిన్ చేసిన సేవలు అటువంటివి మరి. సచిన్ యువరాజ్ సింగ్ తో కలిసి ఆడిన హోలీ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను విపరీతంగా అదరగొడుతున్నాయి.