SA20 League : క్రికెట్ లో అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఈ అద్భుతాలకు ఆటగాళ్లు కారణమవుతారు. అరుదుగా మాత్రమే మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఆ అద్భుతాలలో భాగస్వాములు అవుతారు. అయితే ఈ ప్రేక్షకుడు మాత్రం భాగస్వామి కాదు.. ఏకంగా 1.8 కోట్లకు సూటి పెట్టాడు. ప్రేక్షకుడిగా వచ్చి లక్షాధికారిగా మారిపోయాడు..
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా సౌత్ ఆఫ్రికా t20 లీగ్ నడుస్తోంది. ఇందులో భాగంగా క్యాచ్ 2 మిలియన్ అనే పోటీని నిర్వాహకులు తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎవరైనా ఒక ఆటగాడు సిక్సర్ కొడితే.. మైదానంలో ఉన్న ప్రేక్షకుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒంటి చేత్తో రెండు మిలియన్ రాండ్ లు(ఒక కోటి 8 లక్షలు) ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు ఈ టోర్నీలో ఇంకా కొంతమంది అభిమానులు ఇదేవిధంగా క్యాచ్ లు పట్టుకుంటే.. ఆ నగదును సమానంగా పంచుతామని పేర్కొన్నారు.
సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ప్రేక్షకులను భారీగా తప్పించడానికి నిర్వాహకులు ఈ పని చేశారు. డిసెంబర్ 26 ns సౌత్ ఆఫ్రికా t20 లీగ్ నాలుగో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు జరిగాయి. ముగ్గురు ప్రేక్షకులు ఇదేవిధంగా క్యాచ్ లు అందుకున్నారు. కేప్ టౌన్ ఎమ్ఐ, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య ఒక లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రికెల్టన్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బంతిని స్టాండ్స్ లో ఉన్న ఒక వ్యక్తి ఒక చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అంతేకాదు ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇద్దరు అభిమానులు ఇదేవిధంగా క్యాచ్ లు అందుకున్నారు. అది కూడా వరుస బంతుల్లో క్యాచ్ లు అందుకుని చరిత్ర సృష్టించారు. ట్రెటోరియ జట్టు బౌలర్ పార్సన్స్ వేసిన 14 ఓవర్లు మూడు, నాలుగు బంతులను ముల్డర్ సిక్సర్లు కొట్టాడు. స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులు అద్భుతంగా ఒంటి చేత్తో బంతులను అందుకుని ఎగిరి గంతులు వేశారు.
సౌత్ ఆఫ్రికా t20 లీగ్ తొలి సీజన్ 2023లో మొదలైంది. అప్పటినుంచి ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి క్యాచ్ టు మిలియన్ అనే విధానాన్ని నిర్వాహకులు అమలు చేస్తున్నారు. తొలి సీజన్లో తొమ్మిది మంది.. రెండవ సీజన్లో 8మంది.. మూడవ సీజన్లో 13 మంది లక్షాధికారులుగా నిలిచారు. ఇక ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్లు నిర్వహిస్తారు. టోర్నీ ముగిసే వరకు ఎంతమంది ఇలా క్యాచ్ లు అందుకుంటారో.. లక్షలు సంపాదిస్తారో చూడాల్సి ఉంది.
A guy in the crowd won 2M for taking the catch in SA20. pic.twitter.com/jYEaH4ZF7G
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2025