Pakistan Cricket : ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లతో పాకిస్తాన్ జట్టు బలవంతంగా కనిపించేది. కీలక మ్యాచ్లలో భారత జట్టుపై విజయం సాధించి సంచలనం సృష్టించేది. పైగా అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లో క్రమశిక్షణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ ది ఒక దారి.. ప్లేయర్లది మరొకదారి అన్నట్టుగా సాగుతోంది. ఎవరు ఎప్పుడు కెప్టెన్ అవుతారు? ఎవరు ఎప్పుడు జట్టులో స్థానం కోల్పోతారు? అనే ప్రశ్నలకు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సమాధానం చెప్పేవారు కరువవుతున్నారు. అందువల్లే గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగుండడం లేదు. అండర్ 19 లో సంచలనాలు సృష్టిస్తున్న పాకిస్తాన్ జట్టు.. అదే దూకుడును సీనియర్ ప్లేయర్లు కొనసాగించలేకపోతున్నారు. ఇటీవల స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే.. కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోయింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక జట్లు సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు దాదాపుగా తమ బృందాలను ప్రకటించాయి. పాకిస్తాన్ జట్టు 2026లో జరిగే టి20 వరల్డ్ కప్ కంటే ముందు సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంక జట్టుతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో పాకిస్తాన్ తలపడబోతోంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ సీనియర్ సెలెక్షన్ కమిటీ తీవ్రంగా కసరత్తు చేసింది. ఎలాగైనా సరే విజయం సాధించాలని 15 మందితో జట్టును ప్రకటించింది.. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ అజాం, షాహిన్ అఫ్రిది, హరీస్ రౌప్, మహమ్మద్ రిజ్వాన్ ను ఎంపిక చేయలేదు. అంతేకాదు, అన్ క్యాప్డ్ నపే ను జట్టులోకి తీసుకున్నారు.
రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన నపే ఇటీవల పాకిస్తాన్ షహీన్స్ జట్టులో ఆడాడు. అతడు ఇప్పటివరకు 32 t20 మ్యాచ్ లు ఆడాడు. 132.81 స్ట్రైక్ రేటు కొనసాగిస్తున్నాడు. 688 పరుగులు చేశాడు. ఇతడు మాత్రమే కాకుండా, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ మళ్లీ టి20 జట్టులోకి వచ్చాడు. సల్మాన్ అఘా పాకిస్తాన్ జట్టుకు నాయకుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ సిరీస్లో చేసిన ప్రదర్శన ఆధారంగా.. టీ 20 వరల్డ్ కప్ కోసం ప్లేయర్లను ఎంపిక చేస్తామని పాకిస్తాన్ మేనేజ్మెంట్ తెలిపింది. ఫిబ్రవరి ఏడు నుంచి ఇటువంటి వరల్డ్ కప్ మొదలవుతుంది. పాకిస్తాన్ జట్టు గ్రూప్ బి లో ఉంది. ఇదే విభాగంలో భారత్, నమిబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. పాకిస్తాన్ జట్టుతో భారత్ తలపడే మ్యాచ్లు కొలంబో వేదికగా జరుగుతాయి.