https://oktelugu.com/

T20 World Cup 2024: రోహిత్, కోహ్లీ అనుభవం.. ఆ ముగ్గురికి శాపం.. ఏకంగా టీ-20 ప్రపంచ కప్ నుంచి ఔట్

త్వరలో వెస్టిండీస్ - అమెరికా వేదికగా టీ - 20 వరల్డ్ కప్ జరగనుంది. గత ఏడాది టీ - వరల్డ్ కప్ లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 17, 2024 / 11:49 AM IST

    T20 World Cup 2024

    Follow us on

    T20 World Cup 2024: రోహిత్ హిట్ మాన్. విరాట్ కోహ్లీ రన్ మిషన్. వీరిద్దరి దూకుడైన బ్యాటింగ్ వల్ల భారత జట్టు ఎన్నో విజయాలు సాధించింది. మరెన్నో ట్రోఫీలను దక్కించుకుంది. అలాంటి ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు ఇప్పుడు ముగ్గురు మాన ఆటగాళ్ల పాలిట ప్రతికూలంగా మారారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

    త్వరలో వెస్టిండీస్ – అమెరికా వేదికగా టీ – 20 వరల్డ్ కప్ జరగనుంది. గత ఏడాది టీ – వరల్డ్ కప్ లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆ తప్పు పునరావృతం చేయకుండా ఉండాలని గట్టి పట్టుదలతో ఉంది. అందువల్లే సెలక్షన్ కమిటీ జట్టు కూర్పు విషయంలో పకడ్బందీ విధానాన్ని అవలంబిస్తోంది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత జట్టుకు వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఐసీసీకి సంబంధించిన ఒక్క మెగా ట్రోఫీని కూడా జట్టుకు భారత జట్టుకు వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఐసీసీకి సంబంధించిన ఒక్క మెగా ట్రోఫీని కూడా జట్టుకు భారత జట్టుకు వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఐసీసీకి సంబంధించిన ఒక్క మెగా ట్రోఫీని కూడా జట్టుకు భారత జట్టుకు వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఐసీసీకి సంబంధించిన ఒక్క మెగా ట్రోఫీని కూడా అందించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా టీ -20 వరల్డ్ కప్ అందించాలనే ఆశయంతో ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. వీరిని పక్కకు తప్పించే ఉద్దేశం టీమిండియా సెలక్షన్ కమిటీకి లేదు. అయితే ఈ ఇద్దరి కీలక ఆటగాళ్ల వల్ల ముగ్గురు వర్ధమాన ఆటగాళ్లు అవకాశాలు కోల్పోయే ప్రమాదం నెలకొంది.

    విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ టి20 వరల్డ్ కప్ లో అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం నెలకొంది. రుత్ రాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ ఓపెనింగ్ లో ఉంటుంది. టి20 అంటే వేగంగా ఆడాల్సి ఉంటుంది. పైగా గత కొద్ది ఇన్నింగ్స్ ల్లో గైక్వాడ్, కిషన్ ఆశించినంత స్థాయిలో రాణించడం లేదు. దీంతో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా గిల్ లేదా యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. జైస్వాల్ ఏకంగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం పొందాడు. ఫలితంగా రుత్ రాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ కు ఆడే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ కిషన్ ను మిడిల్ ఆర్డర్లో ఆడించాలని భావిస్తే.. జట్టు మేనేజ్మెంట్ రాహుల్ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది.

    తిలక్ వర్మకు కోహ్లీ ప్రతి బంధకంగా మారినట్టు తెలుసు. మొహాలీలో ఆప్ఘనిస్థాన్ లో జరిగిన తొలి టీ – 20 ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇండోర్ లో జరిగిన రెండో టీ – 20 లో విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఎలెవన్ లోకి ప్రవేశించాడు. దీంతో తిలక్ వర్మ తన స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. విరాట్ ఉన్నంతకాలం టీ-20 లో తిలక్ వర్మకు టీమిండియాలో అవకాశం దక్కనట్టు కనిపిస్తోంది. రోహిత్ శర్మ, గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి వారు ఉన్న నేపథ్యంలో.. తిలక్ వర్మకు అవకాశం దక్కేది అనుమానంగానే ఉంది.