Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ ‘కాపు’ కాస్తోంది

YCP: వైసీపీ ‘కాపు’ కాస్తోంది

YCP: ప్రతి ఎన్నికల్లోను కాపుల మద్దతు ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుంది.ప్రతి ఎన్నికలోను కాపు ఫ్యాక్టర్ పనిచేస్తుంది.అందుకే అన్ని పార్టీలు కాపులకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారని అంచనాలు ఉన్నాయి.పవన్ కూటమిలో ఉండడంతో.. అటువైపు మొగ్గు చూపుతారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో జగన్ జాగ్రత్త పడ్డారు. టికెట్ల కేటాయింపులో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య కుమారుడు వంటివారికి వైసీపీలోకి రప్పించారు. కాపుల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోపడ్డారు.

వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపులకు22 సీట్లు ఇచ్చారు. అదే సమయంలోబలిజ,శెట్టిబలిజ,తూర్పు కాపులకు మరో 10 సీట్లు కేటాయించారు. ఈ లెక్కన కాపులకు 32 సీట్లు వరకు కట్టబెట్టారు. అటు తెలుగుదేశం పార్టీ కేవలం ఎనిమిది మంది కాపులకు మాత్రమే సీట్లు ఇచ్చింది. ఇప్పటివరకు ఆ పార్టీ 128 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. అందులో కాపులు ఎంతవరకు ఉంటారో చూడాలి.

అటు జనసేన, బిజెపి సైతం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారు కాపులకు ఎంత ప్రాధాన్యమిస్తారో చూడాలి. అయితే ముందుగా వైసిపి మాత్రం కాపుల విషయంలో జాగ్రత్త పడింది. గత ఐదు సంవత్సరాల పాలనలో కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ రూపంలో వారికి ఒక వేదిక దొరకడంతో కాపులు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు జగన్ గ్రహించారు. అందుకే కాపుల్లో బలమైన నాయకులను వైసీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఏకంగా 30కి పైగా టిక్కెట్లు కట్టబెట్టారు. కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు సంకేతాలు పంపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. మరి కాపులు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version