https://oktelugu.com/

Maruthi Suzuki : మారుతి సుజుకి ‘బాలెనో’పై బంఫర్ ఆఫర్..రూ.57,000 తగ్గింపు.. త్వరపడండి..

బాలెనో కారును మార్చి నెలలో కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీనిపై రూ.57,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్చేంజ్ బోనస్, రూ.7,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2024 / 11:36 AM IST

    maruthi baleno

    Follow us on

    Maruthi Suzuki : కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది మారుతి సుజుకీ. కొన్నేళ్లుగా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ వర్గాల వారికి అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేస్తూ అత్యధిక సేల్స్ చేస్తోంది. మారుతి నుంచి రిలీజ్ అయినా వ్యాగన్ ఆర్, స్విప్ట్ అన్ని కార్ల కంటే ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. 2024 ఫిబ్రవరి వరకు వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో దూసుకుపోతుండడం విశేషం. ఇదే సమయంలో మారుతి నుంచి రిలీజైన ఓ కారుపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్లను చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు.

    సాధారణంగా కార్లపై దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం సేల్స్ ను పెంచుకునేందుకు సాధారణ రోజుల్లోనూ భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఈ తరుణంలో మారుతి నుంచి పాపుల్ అయిన కారు బాలెనోపై కంపెనీ కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. సాధారణంగా మారుతి కార్లకు ఆదరణ ఎక్కువ. అయినా బాలెనో కారుపై డిస్కౌంట్ ప్రకటించడంతో దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

    మారుతి బాలెనో 1.2లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో CNG వేరియంట్ సౌకర్యం కూడా ఉంది. ఈ కారు పెట్రోల్ పై 88 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ నుఉత్పత్తి చేస్తుండగా.. సీఎన్ జీపై 76 బీహెచ్ పీ పవర్, 98.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు ఏఎంటీ కూడా సపోర్టు చేస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారును రూ.6.66 లక్షల తో విక్రయిస్తున్నారు. ఇందులో సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి.

    బాలెనో కారును మార్చి నెలలో కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీనిపై రూ.57,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్చేంజ్ బోనస్, రూ.7,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. అయితే ఇవి ఆయా ప్రాంతాలను భట్టి మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఆఫర్ మార్చి నెలలోపే ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందువల్ల బాలెనో కొనాలనుకునేవారు వెంటనే బుక్ చేసుకోండి..