RR Vs Mi IPL 2025: ఇక గురువారం ముంబై జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అదే స్థాయిలో మంటలు మండిస్తాడని అందరూ అనుకున్నారు. సూపర్బ్ ఆట తీరుతో ఆకట్టుకుంటాడని అందరూ ఊహించారు.. కానీ అలాంటివి జరగలేదు. పైగా అతనిని చూసి ముంబై జట్టు పెద్దగా వణికిపోలేదు. 14 ఏళ్ల పిల్ల బచ్చగాడు అన్నట్టుగానే తీసుకుంది. అనుకున్నట్టుగానే అతడిని 0 పరుగులకే పక్కన పెట్టింది. బుడ్డోడా పక్కకెళ్ళి ఆడుకోరా అన్నట్టుగా అవుట్ చేసి పడేసింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 217 స్కోర్ చేసింది.. ముంబై ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 116 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత.. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కాదు వీరిద్దరూ చెరి 48 చొప్పున పరుగులు తీశారు. రెండు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. ముంబై జట్టును వీరిద్దరూ తిరుగులేని స్థాయిలో నిలిపారు.. రాజస్థాన్ జట్టు ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు.
Also Read: సామ్ కరణ్ vs పంజాబ్ మేనేజ్మెంట్.. చెన్నై చెపాక్ లో ఏం జరిగింది?
సున్నా పరుగులకే..
ముంబై విధించిన 218 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ప్రారంభంలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ సీజన్లో సూపర్ సెంచరీ చేసి జోరు మీద ఉన్న వైభవ్ సూర్యవంశీని(0) దీపక్ చాహర్ అవుట్ చేశాడు. దీపక్ చాహర్ వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయడంలో విఫలమైన వైభవ్.. విల్ జాక్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు సిక్సర్లు కొట్టి జోరు మీద ఉన్నట్టు కనిపించినప్పటికీ.. బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఈ కథనం రాసే సమయం వరకు రాజస్థాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. నితీష్ రానా (1), రియాన్ పరాగ్(1) క్రీజ్ లో ఉన్నారు.
Also Read: సామ్ కరణ్ సంకేతాలు.. చెన్నై జట్టులో బయటపడ్డ విభేదాలు..