RR VS LSG : విజయానికి దగ్గర్లో ఉండగా రాజస్థాన్ జట్టు తడబడింది. చివరికి ఢిల్లీ చేసిన స్కోరును సమం చేసింది. చివరికి మ్యాచ్ సూపర్ ఓవర్ వరకి వెళ్ళింది. సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు అద్భుతమైన ప్రతిభ చూపి విజయాన్ని సాధించింది. అయితే సూపర్ ఓవర్లో ఢిల్లీ జట్టు తరఫున స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అంతకుముందు రాజస్థాన్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ లో సూపర్ గా బౌలింగ్ వేశాడు. మొత్తంగా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అంతేకాదు డెత్ ఓవర్లలో తనను తోపు అని ఎందుకు అంటారో మరోసారి అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు.. ఇక నిన్నటి లక్నో, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ కూడా స్టార్క్ మాదిరిగానే బౌలింగ్ వేశాడు. ఓడిపోతుందనుకున్న లక్నో జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే అటువంటి ఆవేష్ ఖాన్ తన మనసులో మాటను బయటపెట్టాడు.. స్టార్క్ తో తనను పోల్చుతూ ఉండడాన్ని అతడు తప్పుపట్టాడు.
Also Read : ఓటముల్లో రాజస్థాన్.. గెలుపుల్లో లక్నో.. ఐపీఎల్ లో ఇదో సంచలనం
అతనితో ఎందుకు పోల్చుతున్నారు
ఆస్ట్రేలియా ఆటగాడు స్టార్క్ తో తనను పోల్చవద్దని ఆవేష్ ఖాన్ మీడియా ప్రతినిధులతో చెప్పాడు. స్టార్క్ లాగా తాను అవుదామనుకోవడం లేదని ఆవేష్ ఖాన్ పేర్కొన్నాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా చివరి ఓవర్ లో రాజస్థాన్ జట్టుకు అవసరమైన తొమ్మిది పరుగులను డిఫెండ్ చేసి.. లక్నో జట్టును గెలిచేలా చేశాడు. ” నా ప్రదర్శన బాగుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ పై అద్భుతమైనగణాంకాలు నమోదు చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది.. కాకపోతే నన్ను స్టార్క్ తో పోల్చకండి. ఎందుకంటే నాకంటూ ఒక పేరు ఉంది. స్టార్క్ లాగానే నేను కూడా యార్కర్లు సంధించానని అందరూ అంటున్నారు. కీలకమైన ఓవర్లో బౌలర్లు అదే పని చేస్తారు. నేను కూడా అదే పని చేశాను. అందులో వింత లేదు. నా ప్రతిభ నేను నిరూపించుకున్నాను . యార్కర్లు వేసి మ్యాచ్ గెలిపించడంలో నా వంతు పాత్ర పోషించారు. నేను మిచెల్ స్టార్క్ లాగా కావాలని అనుకోవడం లేదు. నాకంటూ ఒక పేరు ఉంది కదా. నేను ఒక మంచి ఆవేష్ ఖాన్ లాగా మాత్రమే ఉండాలనుకుంటున్నాను. చివరి ఓవర్ లో ప్రతి బంతిని అత్యంత కట్టుదిట్టంగా వేశాను. నా సామర్థ్యం మొత్తం యార్కర్ బంతుల మీద ఆధారపడి ఉంది. పైగా నేను బంతిని వేయడానికి సమయం కాస్త తీసుకుంటాను. అది నాకు కలిసి వచ్చింది. అద్భుతంగా బౌలింగ్ చేయడానికి నాకు ఇది ఉపయోగపడింది. నేను ఎప్పుడూ స్కోర్ బోర్డు చూసి బౌలింగ్ చేయను. ఎలాంటి బంతులు వేయాలనే దానిమీద మాత్రమే దృష్టి సారిస్తాను. ఇక రాజస్థాన్ జట్టు విజయానికి 9 పరుగులు కావలసి వచ్చినప్పుడు.. నేను తొలి 3 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా ఇవ్వకూడదని బలంగా అనుకున్నాను. అలా చేయడంవల్లనే బ్యాటర్ల మీద కాస్త ప్రెజర్ పెరుగుతుందని అనుకున్నాను. దానికి తగ్గట్టుగానే బౌలింగ్ వేశాను. అనుకున్నట్టుగానే మ్యాచ్ గెలిచామని” ఆవేష్ ఖాన్ పేర్కొన్నాడు.
Also Read : ఆవేశ్ ఖాన్.. నీ చేతుల్లో ఏమైనా మాయాజాలం ఉందా బ్రో!