Rohith Sharma: రోహిత్ శర్మ పై ఇలాంటి అభిప్రాయమే సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది. వాస్తవానికి మండే గుండెల వెనుక.. చల్లని వెన్నెల ఉన్నట్టు.. రోహిత్ కోపం వెనక శాంతం ఉంటుంది. అతని ఆగ్రహం వెనుక చల్లని వెన్నెల ఉంటుంది. అన్నింటికీ మించి అతడిలో శాంత స్వభావం తొణికి సలాడుతూ ఉంటుంది. కాకపోతే రోహిత్ దానిని ఎప్పుడూ బయట పెట్టడు. అరుదైన సందర్భంగా మాత్రమే దాన్ని తన సన్నిహితుల వద్ద చూపిస్తుంటాడు. అందుకే రోహిత్ అంటే చాలామందికి అతడిలో ఉన్న ఆగ్రహం గుర్తుకొస్తుంది. అతనిలో ఉన్న కోపం మాత్రమే కళ్ళముందు కనిపిస్తుంది.. కాకపోతే రోహిత్ అప్పుడప్పుడు తనలో ఉన్న అసలు రూపాన్ని చూపిస్తుంటాడు. అయితే అది సింహరాశి సినిమాలో వచ్చి పోవమ్మా మెరుపుతీగ అనే డైలాగ్ లాగా వచ్చి వెళ్తూ ఉంటుంది..
Also Read: డేల్ స్టెయిన్ “300”.. ముంబై ఇండియన్స్ అదిరిపోయే సెటైర్
అభిమానులను ఆటపట్టించాడు
అభిమానులతో రోహిత్ మర్యాదగా ఉంటాడు. మిగతా ఆటగాళ్ల మాదిరిగా చిలిపితనాన్ని ప్రదర్శించడు. ఎంతమంది వచ్చినా సరే ఆటోగ్రాఫ్లు ఓపికగా ఇస్తూ ఉంటాడు.. సెల్ఫీలు కూడా అంతే ఓపికతో దిగుతూ ఉంటాడు. అంతే తప్ప ఏమాత్రం ఆగ్రహాన్ని చూపించడు. పైగా అభిమానులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తుంటాడు. రోహిత్ నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో సందడి చేశాడు. డగ్ అవుట్ వద్ద అతడిని అభిమానులు చూసి కేకలు వేశారు. రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేశారు. దానికి రోహిత్ కూడా అదే విధంగా స్పందించాడు. బిగ్గరగా దగ్గుతున్నట్టు.. వంగి నడిచినట్టు. హావభావాలు ప్రదర్శించాడు. దీంతో అభిమానులు రోహిత్ వాలకాన్ని చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత కొంతమంది అభిమానులు గ్రిల్ ఎక్కి రోహిత్ వద్దకు రావడానికి ప్రయత్నించగా.. అతడు వారిని సున్నితంగా వారించాడు. అదే సమయంలో నవ్వుతూ అభివాదం చేశాడు..” రోహిత్ గంభీరంగా ఉంటాడని చాలామంది అనుకుంటారు. కానీ అతడు చిలిపిగా ఉంటాడు. కాకపోతే దానిని అప్పుడప్పుడు మాత్రమే చూపిస్తుంటాడు. గురువారం జరిగిన మ్యాచ్లో అభిమానులకు అదే కనిపించింది. మామూలుగా అయితే తనలోని స్పందనలను రోహిత్ పెద్దగా బయటపెట్టడు. కానీ నిన్నటి మ్యాచ్లో అతడు ఒక్కసారిగా చిన్నపిల్లడయిపోయాడు. అభిమానులను ఉత్సాహపరచడానికి చిత్రచిత్రమైన హావభావాలు ప్రదర్శించాడు. రోహిత్ అంటే సీరియస్ మాన్.. హిట్ మాన్ మాత్రమే కాదు.. ఇదిగో అప్పుడప్పుడు జోవియల్ మ్యాన్ కూడా.. ఇలాంటప్పుడే రోహిత్ లో ఉన్న అసలు రూపం కనిపిస్తుంది.. అతనిపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారుతుంది. మొత్తానికి రోహిత్ భలే చిలిపి వాడంటూ” నెటిజన్లు పేర్కొంటున్నారు. రోహిత్ గతంలో కూడా ఇలాంటి చిలిపి పనులు చేసినప్పటికీ.. అవి అంతగా వెలుగులోకి రాలేదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉండడం వల్ల రోహిత్ చేసిన పని వెంటనే ప్రపంచానికి తెలిసిపోయింది.
View this post on Instagram