Rohith Sharma : గత సీజన్లో ఐపిఎల్ జరిగినప్పుడు ముంబై జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఆ తర్వాత రోహిత్ పాత్ర ముంబై జట్టులో నామమాత్రమైంది. ఇది రోహిత్ అభిమానులకు ఏమాత్రం మింగుడు పడలేదు. పైగా ముంబై జట్టు తీరుకు వ్యతిరేకంగా మైదానంలో నిరసనలు తెలిపారు. చివరికి రోహిత్ శర్మ భార్య కూడా తన ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ముంబై మేనేజ్మెంట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. గత సీజన్లో ముంబై జట్టు గ్రూప్ దశనుంచే ఇంటికి వెళ్ళిపోయింది.. అయినప్పటికీ ఈ సీజన్ లోనూ హార్థిక్ పాండ్యాను కెప్టెన్ స్థానం నుంచి తొలగించలేదు. ఇక ఈ సీజన్లో ముంబై జట్టు అంతంతమాత్రంగానే ఆడుతోంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడింది. అంతిమంగా విజయం సాధించింది.
Also Read : రోహిత్ శర్మ అంటే మినిమం ఉంటది.. వైరల్ వీడియో
ఎడ మొహం పెడ మొహంగా ఉన్నప్పటికీ..
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆడ లేక పోయాడు. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ కూడా ఫ్లాప్ అయ్యాడు.. తెలుగువాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ సమయంలో.. కరణ్ నాయర్ తుఫాన్ సృష్టించాడు. ఢిల్లీ జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు. ఈ దశలో ముంబైకి వికెట్ కావాల్సి వచ్చినప్పుడు.. రోహిత్ హార్దిక్ కు ఒక సూచన చేశాడు. స్పిన్నర్ తో బౌలింగ్ వేయించాలని సలహా ఇచ్చాడు. రోహిత్ చెప్పినట్టుగానే హార్దిక్ స్పిన్ బౌలర్ ను రంగంలోకి దించాడు. అతడు వేసిన మూడో బంతికే ముంబై జట్టు వికెట్ సాధించింది. తన సూచనతో ముంబై జట్టు వికెట్ సాధించడంతో రోహిత్ శర్మ ఆనందానికి అవధులు లేవు. ఇక ఇదే సమయంలో మైదానంలో ఉన్న హార్థిక్ పాండ్యా కన్ను కొట్టాడు. దానికి రోహిత్ శర్మ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో దర్శనమిస్తోంది. ముంబై అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు..” మొన్నటిదాకా వీరిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. మైదానంలో మాత్రమే మాట్లాడుకున్నారు. కానీ జట్టు కోసం అనగానే ఒక్కసారిగా ఇద్దరు తమ ఈగోలను పక్కన పెట్టారు. ఒకరి సలహాలను మరొకరు అమల్లో పెట్టారు. అందువల్లే ముంబై జట్టు చివరి వరకు పోరాడింది. మొత్తంగా విజయం సాధించిందని” ముంబై అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ సంఘటనతో రోహిత్, హార్దిక్ అభిమానులు తమ మధ్య ఉన్న గొడవలను తాత్కాలికంగా పక్కన పెడతారని.. ఇకపై సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోరని.. జాగ్రత్తగా ఉంటారని.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Rohit suggests Hardik bring a spinner, and the spinner takes the wicket with his third ball.
As the tactic worked Hardik gives Rohit Sharma a flying kiss.
Wait for Rohit Sharma’s priceless reaction!❤️ pic.twitter.com/RL3dViwLYZ
— Radha (@Radha4565) April 14, 2025