Rohit : టీమిండియాకు రోహిత్ శర్మ చేసిన సేవలు ఎనలేనివి. ఆటగాడిగా, సమర్థవంతమైన నాయకుడిగా రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు మరచిపోలేని విజయాలు అందించాడు. కొన్ని నెలల తేడాతోనే భారత క్రికెట్ జట్టును ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీల లో విజేతను చేశాడు. 2024లో టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు రోహిత్ సారధ్యంలోనే ఛాంపియన్ గా అవతరించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే భారత జట్టు ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇక అంతకుముందు అంటే 2023లో భారత్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. నాయకుడిగా.. అద్భుతమైన ఆటగాడిగా టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ మర్చిపోలేని విజయాలు అందించాడు. తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నాడు.
Also Read : రోహిత్ అంటే పేరు కాదు, క్రికెట్ చరిత్రలో బ్రాండ్
ఆ రోజా ఏర్పాటు చేస్తారట
ఇప్పటికే ముంబై మైదానంలో సచిన్ పేరు మీద స్టాండ్ ఉంది. ఈ స్టేడియానికి రోహిత్ శర్మకు బలమైన అనుబంధం ఉంది. ఒకానొక సందర్భంలో రోహిత్ శర్మకు ఈ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రోహిత్ శర్మకు పర్మిషన్ దక్కలేదు. దీంతో రోహిత్ తీవ్రంగా వేదన చెందాడు. ఏనాటికైనా సరే ఈ మైదానంలోకి అడుగు పెడతానని అతడు ప్రతిజ్ఞ చేశాడు. అనుకున్నట్టుగానే ముంబై మైదానంలో అడుగు పెట్టాడు. ఆటగాడిగా.. నాయకుడిగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఈ మైదానంలో ఆడాడు. టీమిండియాకు ఎంపిక కాక ముందు.. ముంబై మైదానంలో రోహిత్ రంజి క్రికెట్ కూడా ఆడాడు. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా రోహిత్.. తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడటం మొదలు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో అతని విఫలమైనప్పటికీ.. మెరుగైన సందర్భాల్లో విజయవంతమయ్యాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఆడిన తీరు ఇప్పటికీ ముంబై మైదానంలో సజీవంగా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అందువల్లే రోహిత్ శర్మ అట తీరుకు గుర్తుగా మే 13న అధికారికంగా ముంబై మైదానంలో రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు . దీనికి సంబంధించిన వివరాలను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు వెల్లడించారు. ” రోహిత్ పేరుతో ముంబై మైదానంలో స్టాండ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది మాకు గర్వకారణమైన విషయం. మే 13న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని” ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. రోహిత్ పేరుతో ఏర్పాటు చేస్తున్న స్టాండ్ ను ప్రారంభించడానికి.. దిగ్గజ క్రికెటర్లు హాజరవుతారు. రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు హాజరవుతారు. గత ఏడాది రోహిత్ శర్మ భార్య పండంటి బాబుకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : రోహిత్ అంటే అట్లుంటది మరి.. పరాయి జట్టు సభ్యుడు ఆకాశానికి ఎత్తేశాడుగా!