Rohit Sharma Vs Hardik Pandya: వన్దే వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఫైనల్లో ఓడిపోయి దారుణమైన పరాభవాన్ని మూటకటుకుంది. ఇక దానికి రివెంజ్ గా ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో మన ప్లేయర్లు అద్భుతమైన ఆట తీరు ను కనబరిచి ఆస్ట్రేలియా ని ఓడించి టి20 సిరీస్ ని కైవసం చేసుకున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక ఫ్యూచర్ లో ఇండియన్ టీం టి20 కెప్టెన్ గా ఎవరిని కొనసాగించాలి అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టి 20 ఫార్మాట్ కి హార్దిక్ పాండ్య ని ఫుల్ టైం కెప్టెన్ గా చేయాలని బిసిసిఐ ఎప్పటి నుండో అనుకుంటుంది. అయినప్పటికీ తను ప్రస్తుతం గాయం కారణంగా మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టి20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు గా చాలా రోజుల నుంచి కథనాలు అయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు 2024 లో టి20 వరల్డ్ కప్ ఉండడంతో ఈ మ్యాచ్ లకు కెప్టెన్ గా హార్దిక్ ఉంటాడా లేదా రోహిత్ శర్మ కెప్టెన్ గా చేస్తాడా అనేదానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక దీనిపైన ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా మాజీ ఇండియన్ పస్ బౌలర్ అయిన ఆశిష్ నెహ్ర కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు…
తను మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయం కారణంగా టీంలోకి రాలేకపోతున్నాడు కాబట్టి తను టీం లోకి ఎప్పుడు వస్తాడో కూడా క్లారిటీ లేదు.డైరెక్ట్ గా ఐపీఎల్ లో ఆడడానికి వస్తే మాత్రం అప్పుడు అతను కెప్టెన్సీ ఎలా ఉంటుందనే దాని పైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.ఆ సమయంలో ఐపీఎల్ ముగిసిన వెంటనే టి20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. టి20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగినప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు టీంలో ఉంటారా లేదా అనే దాని పైన కూడా బీసీసీఐకి ఒక క్లారిటీ అయితే రావడం లేదు ఎందుకంటే రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు టి20 వరల్డ్ కప్ లో ఆడితే వాళ్ళ అనుభవం అనేది కొంతవరకు టీం కి ప్లస్ అవుతుందని చెబుతూనే వాళ్ళు అప్పటి వరకు ఫిట్ గా ఉంటే టీంలోకి వస్తారు, లేదంటే టీమ్ లోకి రాలేరు అని ఆశిష్ నెహ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు…
ఇక ఇది ఇలా ఉంటే వన్డే వరల్డ్ కప్ లో తనదైన రీతిలో బౌలింగ్ చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి వరుసగా వికెట్లను తీసి ఇండియన్ టీం తరుపున వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందిన మహమ్మద్ షమీ మంచి గుర్తింపు పొందాడు. అయితే తను వరల్డ్ కప్ లో అడుతాడా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. చాలామంది షమీ టి20 వరల్డ్ కప్ కూడా ఆడాలని కోరుకుంటున్నప్పటికీ తను బాగా ఆడాలి అంటే అత్యుత్తమమైన ప్రదర్శనని కనబరిచాలి అలాగే తన ఫిట్నెస్ ను కూడా తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది…ఇవన్నీ ఓకే అయితేనే షమీ టి20 వరల్డ్ కప్ లో ఆడుతాడు…