Rohit Sharma: ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఇప్పటివరకు 5 కప్పులను ముంబై టీం కి అందించాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్థిక్ పాండ్య ని కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశ్యం లో ఆ టీం యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్య ని ట్రేడింగ్ పద్ధతి ద్వారా ముంబై ఇండియన్స్ టీమ్ తీసుకుంది.
ఇక ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ టీం కి ఈ సంవత్సరం నుంచే హార్థిక్ పాండ్య కెప్టెన్ గా ఉంటాడా లేదా రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత తను కెప్టెన్ గా వ్యవహరిస్తాడా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ స్టార్టింగ్ లో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ టీం వైపు ఆడాడు అందులో భాగంగానే 2009వ సంవత్సరంలో గిల్ క్రిస్ట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఈ టీం కి కప్పు కూడా వచ్చింది. అప్పుడు రోహిత్ టీమ్ మెంబర్ గా ఉన్నాడు.ఇక ఇప్పుడు హైదరాబాద్ టీం కి మరోసారి రోహిత్ శర్మ అవసరమైతే ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ టీం లో కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్య ని తీసుకున్నప్పుడు రోహిత్ శర్మ ఆ టీంలో ఉండాల్సిన అవసరం లేదు.
కాబట్టి రోహిత్ శర్మ ఇప్పుడు హైదరాబాద్ టీం కి వస్తే బాగుంటుందని అభిమానులందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ లాంటి ఒక కెప్టెన్ హైదరాబాద్ టీం కి వస్తే హైదరాబాద్ టీమ్ రూపు రేఖలు మారిపోతాయి అనేది ప్రతి అభిమాని కోరుకునే ఓ కోరిక…ఇక డిసెంబర్ 19న మినీ ఆక్షన్ జరిగిన తర్వాత కూడా ట్రేడింగ్ కి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకైనా రోహిత్ శర్మ హైదరాబాద్ టీమ్ కి ట్రేడింగ్ ద్వారా వస్తే తీసుకోవడానికి హైదరాబాద్ యాజమాన్యం రెడీగా ఉంది. కాబట్టి రోహిత్ ఒకసారి హైదరాబాద్ కి ఆడి హైదరాబాద్ ని ఐపీఎల్ లో కప్పు గెలిచేలా చేస్తే బాగుంటుంది.
మొదట ఐపిఎల్ ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు ఇండియన్ టీం కెప్టెన్ గా ఎదిగాడు కాబట్టి హైదరాబాద్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా రోహిత్ శర్మ కి ఎంతైనా ఉంది. కాబట్టి తను టీమ్ లోకి వస్తే బాగుంటుందని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి…