Rohit Sharma : రోహిత్ శర్మ.. ఈ కాలపు హిట్ మాన్ గా పేరుపొందిన ఆటగాడు. అతడు మైదానంలోకి వస్తే బౌలర్లపై బ్యాట్ తో తాండవం చేస్తాడు. శ్రీలంక నుంచి ఆస్ట్రేలియా దాకా పేరొందిన బౌలర్లు సైతం ఇతడికి బౌలింగ్ చేయాలంటే అదిరిపోతారు.. ఫోర్లు, సిక్సర్లు మంచినీళ్లు తాగినంత ఈజీగా కొడతాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు, మైదానంలో సాధన వంటి వాటితో బిజీబిజీగా ఉన్న రోహిత్ శర్మ ఇటీవల కపిల్ శర్మ నిర్వహించిన కామెడీ షో కార్యక్రమానికి శ్రేయస్ అయ్యర్ తో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను కపిల్ శర్మతో పంచుకున్నాడు.
కపిల్ శర్మ షో లో..
ఈ షో లో భాగంగా రోహిత్ శర్మను కపిల్ శర్మ ” మీరు రూమ్ షేర్ చేసుకుంటే ఎవరితో కలిసి ఉండడానికి ప్రాధాన్యం ఇస్తారు” అని ప్రశ్న సంధించాడు.. దానికి రోహిత్ శర్మ తడుముకోకుండా సమాధానం చెప్పాడు.” ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన గది ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ రూమ్ పంచుకునే అవకాశం వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ శిఖర్ ధావన్, రిషబ్ పంత్ తో కలిసి ఉండను. వాళ్లు గదిని చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి మార్చుతారు. సాధన ముగియగానే వారి దుస్తులను మంచంపై పడేస్తారు. వారి గది తలుపులపై don’t disturb అనే నోటీస్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వారు మైదానంలో సాధన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిద్రపోతారు.. గదిని శుభ్రపరిచే సిబ్బంది రాకుండా ఉండేందుకు వారు అలా చేస్తారు. అందుకే వారి గదులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలా ఉండడంవల్ల వారితో ఉండే ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడతారు. అందుకే నేను వారితో కలిసి ఉండాలనులనుకోను” అంటూ రోహిత్ శర్మ సరదాగా వ్యాఖ్యానించాడు.
ఆగ్రహం వ్యక్తం చేస్తారని భయపడ్డా
రూమ్ షేరింగ్ తర్వాత.. వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమి గురించి కపిల్ శర్మ ప్రశ్న సంధించాడు. ” వరల్డ్ కప్ ఫైనల్ స్వదేశంలో జరిగినప్పటికీ.. మేము నిరాశజనకమైన ఆట తీరు ప్రదర్శించాం. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. వాస్తవానికి ఆ ఓటమి తర్వాత దేశం మొత్తం మా మీద కోపంగా ఉంటుందని భావించాం. కానీ, ప్రజలు మాత్రం మా వైపు ఉన్నారు. ఎంతో బాగా ఆడామని ప్రశంసించారు. వారు క్రికెట్ ను ఆస్వాదించడాన్ని నేను చూశాను.” అంటూ రోహిత్ తన సమాధానాన్ని తెలియజేశాడు..కాగా, రోహిత్ శర్మ ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై జట్టు కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు. గత రెండు సీజన్లలో ముంబై జట్టు ఆశించినంత స్థాయిలో ఆట తీరు ప్రదర్శించకపోవడంతో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినట్టు ముంబై యాజమాన్యం పరోక్షంగా వ్యాఖ్యానించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. ఆదివారం ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం సాధించింది. మూడు వరుస ఓటముల తర్వాత ముంబై విజయం సాధించడంతో జట్టు యాజమాన్యానికి, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించింది.
Rohit sharma said that he wouldn’t ever want to share room with Rishbah pant in kapil show@ImRo45@RishabhPant17 pic.twitter.com/VJaI0BgKbu
— Vaibhav (@Vaibhav9668) April 7, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Rohit sharma rohit sharma says he cant be with shikhar dhawan and rishabh pant
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com