Horoscope Today: 2024 ఏప్రిల్ 8న ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. అమావాస్య సందర్భంగా కొన్ని రాశుల వారికి రాజయోగం కలగనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సోమవారం చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈరోజు వ్యాపారులకు అనుకూలం. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.
వృషభ రాశి:
కుటుంబ సభ్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రియమైన వారితో ముఖ్యవిషయం చెబుతారు. కొందతు అతిథులు రావొచ్చు.
మిథునం:
రాజకీయ అనుబంధం ఉన్న వారికి అనుకూల ఫలితాలు. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
కర్కాటకం:
ఈ రాశివారిని ఎవరైనా బాధపెట్టవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే చాలాసార్లు ఆలోచించాలి. సోదరుల నుంచి సాయం తీసుకుంటారు.
సింహ:
పోటీ పరీక్షలకు సిద్ధపడేవారికి అనుకూల వాతావరణం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు.
కన్య:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కోర్టు అంశం ఈరోజు పరిష్కరించబడుతుంది.
తుల:
రాజకీయ రంగానికి చెందిన వారు ఉన్నత పదవులు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొదే అవకాశాలు ఎక్కువ.
వృశ్చికం:
పెద్దలకు సాయం చేస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇతరుల నుంచి సాయం పొందుతారు.
ధనస్సు:
కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒంటరిగా ఉండే వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర:
ఎవరి దగ్గరి నుంచి డబ్బు పొందితే తిరిగి చెల్లిస్తారు. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఇస్తుంది. ఇతరులకు అనవసరంగా డబ్బు ఇవ్వకుండా ఉండాలి.
కుంభం:
అవివాహితులు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే సమ్యలు ఎదుర్కొంటారు.
మీనం:
ఉద్యోగులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడుతారు. పెద్దల నుంచి సలహాలు తీసుకోవాలి.