https://oktelugu.com/

Rohit Sharma: రోహిత్ శర్మ మాటలకి ఎమోషనలై కన్నీరు పెట్టుకుంటున్న అభిమానులు…

సెమీఫైనల్ లో కూడా న్యూజిలాండ్ టీం ను చిత్తు చేసి వరుసగా 10 మ్యాచులు గెలిచి అంగరంగ వైభవంగా ఫైనల్ కి చేరుకున్నారు. అయినప్పటికీ ఫైనల్లో మన బ్యాట్స్ మెన్స్ కొంతవరకు తడపడడంతో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు రెచ్చిపోయి ఇండియన్ టీం ని ఓడించి ఆస్ట్రేలియా ని విశ్వ విజేతగా నిలిపారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 13, 2023 7:12 pm
    Rohit Sharma

    Rohit Sharma

    Follow us on

    Rohit Sharma: గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇండియన్ టీం ఆశలన్నీ వరల్డ్ కప్ మీదనే పెట్టుకొని ఎలాగైనా ఈసారి మనమే వరల్డ్ కప్ కొట్టాలి అనే కాన్సెప్ట్ తో మన ప్లేయర్లు తమదైన రీతిలో మ్యాచులు ఆడడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.ఇక ఈ క్రమంలోనే టోర్నీలోని లీగ్ మ్యాచ్ లన్నింటిలో విజయం సాధించి తనదైన రీతిలో సత్తా చాటుకున్నారు.

    ఇక అదే ఊపులో సెమీఫైనల్ లో కూడా న్యూజిలాండ్ టీం ను చిత్తు చేసి వరుసగా 10 మ్యాచులు గెలిచి అంగరంగ వైభవంగా ఫైనల్ కి చేరుకున్నారు. అయినప్పటికీ ఫైనల్లో మన బ్యాట్స్ మెన్స్ కొంతవరకు తడపడడంతో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు రెచ్చిపోయి ఇండియన్ టీం ని ఓడించి ఆస్ట్రేలియా ని విశ్వ విజేతగా నిలిపారు. ఇక ఈ ఘోరమైన ఓటమిని ఇండియన్ టీం ప్లేయర్ లతోపాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

    ఈ మ్యాచ్ జరిగి దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇండియన్ ప్రజలందరూ కూడా ఈ ఓటమిని అంత ఈజీగా మర్చిపోవడం లేదు.ఎందుకంటే మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఇండియానే విజయం సాధించి కప్పు కొడుతుంది అని ఇండియా లోని 130 కోట్ల మంది జనాలు ఆశించినప్పటికీ అది కలగానే మిగిలింది. ఇక ఇప్పుడు ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది ప్రేక్షకులని ఏ మొహం పెట్టుకొని చూడాలో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ మూడ్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్, సన్నిహితులు అందరూ కూడా తనని మోటివేట్ చేస్తూ ఆటలో గెలుపు, ఓటములు సహజమంటూ చాలా రకాల మాటలు చెప్పడంతో తనకి తాను ‘జీవితం అంటే పోరాటం దాంట్లో గెలుపు కోసం నిత్యం పోరాటం చేస్తూ ముందుకు సాగాలి’ అంటూ తనకు తాను చెప్పుకొని మళ్లీ మామూలుగా మారినట్టుగా ఒక వీడియోలో తెలియజేశాడు.

    ఇక సౌతాఫ్రికా తో ఆడే టెస్ట్ సిరీస్ కి మళ్లీ టీం లోకి వస్తున్నాడు…ఇక ఇప్పుడు సౌతాఫ్రికా తో ఇండియన్ టీమ్ టి20 సిరీస్ ఆడుతుంది దీని తర్వాత వన్డే సిరీస్ ఆడుతుంది ఇక అది పూర్తయిన తర్వాత టెస్ట్ సిరీస్ ఆడుతుంది…ఇక ఈ టెస్ట్ సీరీస్ లో గెలిస్తే మళ్ళీ ఇండియన్ టీమ్ డబ్ల్యుటిసి ఫైనల్ కి అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగు అవుతాయి…అందుకే ఈ సీరీస్ మీద ఇండియన్ టీమ్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు గా తెలుస్తుంది…