Rohit Sharma: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. టెస్ట్ ఫార్మాట్లో పరుగులు తీయలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కొన్నిసార్లు సున్నా పరుగులకు, మరి కొన్నిసార్లు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాడు.. చివరికి ఆస్ట్రేలియా సిరీస్ లో సిడ్నీ టెస్ట్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ తప్పుకుంటే మంచిది.. క్రికెట్ కు వీడ్కోలు పలకడం మంచిదని కామెంట్లు వినిపించడం మొదలుపెట్టాయి. మాజీ ఆటగాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ఎందుకైనా మంచిది రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని అన్నారు. ఇక ఇదే క్రమంలో రోహిత్ రంజీ లో ప్రవేశించాడు. ముంబై జట్టు తరఫున ఆడాడు. అక్కడ కూడా అదే ఫలితం వచ్చింది. స్వల్ప పరుగులకే అతడు వెనుదిరిగాడు.. దీంతో రోహిత్ కెరియర్ సాగడం కష్టమే.. అతడు రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం అని వ్యాఖ్యలు వినిపించాయి. దీనికి తోడు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ స్వల్ప పరుగులకే అవుట్ కావడంతో విమర్శలు మరింత పెరిగాయి.
జోరు చూపించాడు
కటక్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండవ వన్డేలో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. 119 పరుగులు చేసి.. తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు.. వైస్ కెప్టెన్ గిల్(60) తో కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే చాలా రోజుల తర్వాత రోహిత్ సెంచరీ చేయడంతో స్పోర్ట్స్ వర్గాల్లో రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. ఉన్నట్టుండి రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం.. సెంచరీ తో ఆకట్టుకోవడం స్పోర్ట్స్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ..అయితే తొలి మ్యాచ్లో యశస్వి జైస్వాల్ తో ఓపెనర్ గా రోహిత్ బరిలోకి వచ్చాడు. అయితే రెండవ వన్డే లో యశస్వికి చోటు లభించకపోవడంతో..గిల్ తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. గిల్ తో రోహిత్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. దానిని రోహిత్ కటక్ వన్డేలోనూ కంటిన్యూ చేశాడు. రోహిత్, గిల్ జోడి సక్సెస్ ఫుల్ డ్యూ యో గా పేరు తెచ్చుకుంది.. గత ఎనిమిది ఇన్నింగ్స్ లలో రెండుసార్లు శతకం, నాలుగు సార్లు అర్థ శతక భాగస్వామ్యాలను గిల్ – రోహిత్ జోడి నెలకొల్పింది. కటక్ మ్యాచ్ లోనూ వంద బంతులను ఎదుర్కొని వీరిద్దరూ 136 పరుగులు చేశారు. తద్వారా ఇంగ్లాండ్ విధించిన 300+ స్కోర్ టార్గెట్ ను ఈజీగా ఫినిష్ చేసేందుకు పునాదులు వేశారు. ” రోహిత్ ఫామ్ లోకి వచ్చాడు.. సుదీర్ఘకాలం తర్వాత తనలో ఉన్న ఆటతీరులను మరోసారి ప్రదర్శించాడు. గిల్ తోడు ఉంటే చాలు రోహిత్ చెలరేగిపోతాడు. దానిని మరోసారి నిరూపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరిద్దరే ఓపెనింగ్ లోకి దిగితే.. మామూలుగా ఉండదు. ఇలానే ఆడితే కచ్చితంగా టీం ఇండియా విజేతగా నిలుస్తుంది. గత సీజన్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటుంది. ఇంతకంటే మంచి సందర్భం మరొకటి వస్తుందని అనుకోవడంలేదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.