Rohit Sharma: ప్రస్తుతం ఆడుతున్న వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తుంది. వరుసగా 6 విజయాలు అందుకొని పాయింట్స్ టేబుల్ లో ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఇప్పటికే సెమీస్ కి ఇండియన్ టీమ్ క్వాలిఫై అవ్వగా ఇక మిగితా మ్యాచ్ లను కూడా పరిపూర్ణంగా పూర్తి చేస్తే ఇండియా కి వరల్డ్ కప్ అందుతుంది. వరల్డ్ కప్ హిస్టరీ లోనే ఇండియాకి కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని తప్ప మరే సారధి కూడా ఇప్పటివరకు ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ అందించలేదు.ఇంకా వాళ్ళిద్దరి సరసన ప్రస్తుతం రోహిత్ శర్మ నిలబడే పొజిషన్ లో కనిపిస్తున్నాడు. ఇక ఇదే టైంలో ఇండియన్ టీమ్ అద్భుతమైన విజయాలను అందుకొని తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు అందరూ కూడా రోహిత్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…
అయితే కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా భాద్యతలను స్వీకరించాడు.ఇక రోహిత్ శర్మ మొదట్లో చాలా పరభావాలు ఎదుర్కొన్నాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ , శ్రీలంక లాంటి జట్ల మీద ఓడిపోవడాలు, 2022 t20 ప్రపంచ కప్ సెమి ఫైనల్ కి వెళ్లి అక్కడ నుంచి ఓడిపోయి మనస్థాపంతో ఇండియన్ టీం బయటికి రావడం జరిగింది. ఇక ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత రోహిత్ శర్మ తనదైన రీతిలో మ్యాచులు ఆడాలనే ఉద్దేశ్యం తో తన స్ట్రాటజీ మార్చి తను
ముందుండి ప్లేయర్లను ముందుకు నడిపిస్తున్నాడు…
వరల్డ్ కప్ కి ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ లో కూడా అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు చాలా సార్లు డక్ అవుట్ కూడా అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్లేయర్ గా సక్సెస్ కాలేకపోతున్నాడు కెప్టెన్ గా ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనే భావన అందరిలో నెలకొంది. ఇక ఇలాంటి క్రమంలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనదైన రీతిలో వరల్డ్ కప్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఒక సెంచరీ చేసి తనదైన రీతిలో మ్యాచులు ఆడుతున్నాడు…ఇక ఇప్పటికే ఇండియన్ దిగ్గజ ప్లేయర్ అయిన గౌతమ్ గంభీర్ కూడా రోహిత్ శర్మ మీద ప్రశంసల వర్షం కురిపించాడు తను ముందుండి టీం ని నడిపిస్తూ ప్లేయర్ గా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ లు ఇస్తూ కెప్టెన్ గా సరైన సమయంలో మంచి డిసీజన్స్ తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు ఒక నాయకుడు అంటే ఇలానే ఉండాలి అంటూ రోహిత్ శర్మ పైన ప్రశంసలు కురిపించాడు …
ఇక ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్ తో ఆడిన మ్యాచ్‌లో కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో పోరులో కఠిన పరిస్థితుల్లో 101 బంతుల్లో 87 పరుగులు చేసి టీమ్ లో ప్లేయర్లు అందరూ ఫెయిల్ అయిన కూడా తను కెప్టెన్ గా టీమ్ భారాన్ని మోస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ తరపున అత్యుత్తమ బ్యాటర్ గా రోహిత్ నిలవడం జరిగింది.ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ల్లో 66.34 సగటుతో 398 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలున్నాయి.
రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో అద్భుతాలను చేస్తున్నాడు.ఏ టైంలో ఏ ప్లేయర్ తో ఆడించాలి, ఏ టైం లో ఏ బౌలర్ ని దింపితే మనకు వికెట్ దొరుకుతుంది అనే స్టాటిస్టిక్స్ తో వ్యూహాలు రచించి ఆ బౌలర్లను బరిలోకి దింపుతున్నాడు ఆ రకంగా సక్సెస్ లను కూడా సాధిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు అన్ని ఫార్మాట్ల లో కలిపి రోహిత్ శర్మ 100 మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించగా అందులో 74 మ్యాచులు విజయాలను సాధించాయి,23 మ్యాచులు ఓడిపోయాయి, 2 మ్యాచ్ లు డ్రా అయ్యాయి, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు… ఇక ఈ రకంగా రోహిత్ శర్మ కెప్టెన్ గా ధోని సరసన నిలిచే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియన్ దిగ్గజ ప్లేయర్ అండ్ మాజీ కెప్టెన్ అయిన రికి పాంటింగ్ కూడా రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో ప్రెజర్ ని బాగా కంట్రోల్ చేస్తూ అద్భుతమైన కెప్టెన్సీ చేస్తున్నాడని రోహిత్ పైన ప్రశంసలు కురిపించాడు…
ఇక రికార్డుల విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికైతే రోహిత్ శర్మ టార్గెట్ మొత్తం వరల్డ్ కప్ కొట్టడం పైనే ఉంది ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా ఇండియన్ టీం ని సెమీఫైనల్ దాకా తీసుకెళ్లిన రోహిత్ శర్మ సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి తీసుకెళ్లి ఫైనల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు…ఇక నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఫైనల్ కి వెళ్లి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి…