Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma Injury: కాళ్లకు కట్లతో రోహిత్ శర్మ.. పంజాబ్ మ్యాచ్ లో ఆడడంపై క్లారిటీ

Rohit Sharma Injury: కాళ్లకు కట్లతో రోహిత్ శర్మ.. పంజాబ్ మ్యాచ్ లో ఆడడంపై క్లారిటీ

Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఇటీవల జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఫీల్డింగ్ లోకి రాలేదు. బ్యాటింగ్ కూడా తన స్థాయిలో చేయలేకపోయాడు. గాయం కావడంతో అతడు ఫీల్డింగ్ లోకి రాలేదని వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే రోహిత్ అసౌకర్యంగా కనిపించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆరోగ్యం పై రకరకాల వదంతులు వినిపించాయి. అతని ఆరోగ్యంపై ముంబై మేనేజ్మెంట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం పంజాబ్ తో జరిగే మ్యాచ్ కు అతడు దూరమవుతాడని ప్రచారం జరిగింది. మరికొన్ని మ్యాచులలో కూడా అతడు ఆడేది అనుమానమేనని వార్తలు వినిపించాయి. అయితే గురువారం ముంబై మైదానంలో జరిగే మ్యాచ్లో అతడు ఆడతాడని క్లారిటీ వచ్చేసింది. కాళ్లకు కట్లు కట్టుకొని.. హిట్ మ్యాన్ తీవ్రంగా సాధన చేశాడు. ఒకప్పటి మాదిరిగా ఉత్సాహంగా కనిపించాడు. పదేపదే బ్యాటింగ్ చేసి తన లోపాలను సవరించుకునే ప్రయత్నం చేశాడు. స్పిన్ బౌలింగ్ లో ఎక్కువసేపు ఆడిన రోహిత్.. బ్యాట్ ను స్వేచ్ఛగా ఝుళిపించాడు.

రోహిత్ అంతకుముందు ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు సునీల్ చత్రితో మాట్లాడాడు. అతడు ముంబై ప్లేయర్లతో కలిసి ఫుట్ బాల్ ఆడుతుంటే వీక్షించాడు. కొద్దిసేపు తను కూడా ఆడాడు.. ఆ తర్వాత సునీల్ తో చాలాసేపు మాట్లాడాడు. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ముంబై యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది.

వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఎలాగైనా ఆడాలని రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బరువు పూర్తిగా తగ్గిపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. బ్యాటింగ్లో కూడా ఒకప్పటి జోరు చూపిస్తున్నాడు. బరువు తగ్గడం.. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడంతో అతడిని వచ్చే వన్డే వరల్డ్ కప్ లో జట్టులోకి తీసుకుంటారని ప్రచారం మొదలైంది. అయితే దానిపై అటు మేనేజ్మెంట్.. ఇటు రోహిత్ శర్మ క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య మాత్రం వన్డే వరల్డ్ కప్ జట్టు గురించి గంభీర్ మాట్లాడాడు. ఇంకా ఆ టోర్నీకి సమయం ఉందని.. ఆ సమయం నాటికి జట్టులో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అనే విషయాలపై ఇప్పుడే సమాధానం చెప్పబోమని గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ మాటలు ఎలా ఉన్నా సరే.. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ప్రస్తుత ఐపిఎల్ లో రోహిత్ సమర్థవంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉన్నంత సేపు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల మధ్య వేగంగా కదులుతున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన లెగ్ సైడ్ షాట్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాడు. అతడు గనుక ఇదే జోరు కొనసాగిస్తే వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular