Homeఎంటర్టైన్మెంట్Kamal Haasan Stalin Viral Video: తమిళనాడు సీఎం స్టాలిన్ కి బౌన్సర్ గా వ్యవహరించిన...

Kamal Haasan Stalin Viral Video: తమిళనాడు సీఎం స్టాలిన్ కి బౌన్సర్ గా వ్యవహరించిన కమల్ హాసన్.. వైరల్ అవుతున్న వీడియో..

Kamal Haasan Stalin Viral Video: సరిగ్గా మరో వారం రోజుల్లో తమిళనాడు లోని సార్వత్రిక ఎన్నికల పోరు జరగనుంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు , ప్రతి వ్యూహాలు , వాగ్దానాలతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. తమిళనాడు లో ఏ మూల చూసినా ఎన్నికల సందడే కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల సమరం లోకి మొట్టమొదటిసారి తమిళ సూపర్ స్టార్ విజయ్ TVK పార్టీ ద్వారా పోటీ చేయబోతుండడం ఈ రాజకీయాల్లో మరింత వేడిని […]

Kamal Haasan Stalin Viral Video: సరిగ్గా మరో వారం రోజుల్లో తమిళనాడు లోని సార్వత్రిక ఎన్నికల పోరు జరగనుంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు , ప్రతి వ్యూహాలు , వాగ్దానాలతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. తమిళనాడు లో ఏ మూల చూసినా ఎన్నికల సందడే కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల సమరం లోకి మొట్టమొదటిసారి తమిళ సూపర్ స్టార్ విజయ్ TVK పార్టీ ద్వారా పోటీ చేయబోతుండడం ఈ రాజకీయాల్లో మరింత వేడిని రేకెత్తించుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాలకు ఒకప్పుడు జనాలు ఎలా వచ్చేవారో, విజయ్ ఎన్నికల ప్రచారానికి కూడా జనాలు అలాగే తరలివస్తున్నారు. వీరిలో ఎంత మంది ఓట్లు వేస్తారో తెలియదు కానీ , విజయ్ కి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, జన సమీకరణ జరిగిపోతుంది. ఇదంతా పక్కన పెడితే తమిళ లెజండరీ హీరో కమల్ హాసన్ కూడా ఒక పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

ఈయన పార్టీ పేరు ‘మక్కల్ నీది మైయమ్’. గత ఎన్నికల్లో ఈయన పార్టీ టార్చ్ లైట్ గుర్తు మీద పోటీ చేసింది. స్వయంగా కమల్ హాసన్ సైతం ఓడిపోగా, ఆయన పార్టీ కి ఓవరాల్ గా 2.82 శాతం ఓటింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన ఒంటరి పోరు చేసి , ఈ ఎన్నికల్లో తన పార్టీ కి బలం చేకూరుస్తాడని ఆయన అభిమానులు , పార్టీ నాయకులూ బలంగా నమ్మారు. కానీ కమల్ హాసన్ అధికారిక DMK పార్టీ తో పొత్తు పెట్టుకున్నాడు. ఆ కారణం చేత ఆయన రాజ్య సభ సీట్ కూడా వచ్చింది. ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేసాడు. DMK పార్టీ కమల్ పార్టీ కి ఒక్క సీటు ఇవ్వడానికి ఒప్పుకుంది కానీ , తమ DMK పార్టీ గుర్తు మీదనే పోటీ చెయ్యాలని కండీషన్ పెట్టింది.

అందుకు కమల్ హాసన్ ఒప్పుకోకపోవడం తో , ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయడం లేదు కానీ, DMK కూటమి లో కొనసాగుతూ , ఆ పార్టీ కి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాడు. సీఎం స్టాలిన్ కి బానిస లాగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ పై సోషల్ మీడియా లో నెగటివిటీ మామూలు రేంజ్ లో లేదు. రీసెంట్ గానే ఆయన సీఎం స్టాలిన్ తో కలిసి నడిచి వస్తున్న ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. స్టాలిన్ మధ్యలో నడిచి వస్తుంటే, ఆయనకు కుడి వైపున కమల్ హాసన్ బాడీ గార్డ్ లాగా వ్యవహరిస్తూ వస్తున్నదని , ఇంత బ్రతుకు బ్రతికి కమల్ హాసన్ ఇలా అయిపోవడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper